ఏపీలో వస్తున్న ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. ప్రజలు ఏకపక్షంగానే తీర్పు ఇచ్చారని తెలుస్తోం ది. ముఖ్యంగా సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో “మీకుటుంబానికి మంచి జరిగిందని అనుకుంటేనే మాకు ఓటు వేయండి” అని పిలుపునిచ్చారు ఇప్పుడు వస్తున్న ట్రెండును పరిశీలిస్తే.. జనాలు ఈ దిశగా నే ఓటు వేశారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే.. ఇక్కడ కూడా..వైసీపీకి బెడిసి కొట్టింది.
లక్షల కోట్ల రూపాయలను డీబీటీవిధానంలో ప్రజలకు పంపిణీ చేశామని.. రాష్ట్రంలోనేకాదు.. దేశంలో కూ డా ఏ ప్రభుత్వం కూడా.. ఇలా పంపిణీ చేయలేదని.. నాడు నేడు ద్వారా ఇళ్లు ఇచ్చామని.. పాఠశాలలను అభివృద్ధి చేశామని.. జగన్ చెప్పుకొచ్చారు. కానీ. దీనివైపు ప్రజలు నడిపించలేక పోయారనేది స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. అసలు మంత్రుల విషయంలోనూ జగన్ ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేశామని చెప్పారు. వారికి పదవులు ఇచ్చామన్నారు.
కానీ, కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితిని గమనిస్తే.. ఎక్కడా కూడా.. వైసీపీకి ఆశించిన ఫలితం మాత్రం ఎక్కడా దక్కలేదు. మరి ఇంత చేసిన జగన్ ఎవరినీ సంతృప్తి పరచలేక పోయారనే వాదన వినిపిస్తోంది. నిజానికి కులం చూడం మతం చూడం.. పార్టీలు కూడా చూడబోమని చెప్పిన జగన్ మాటలు ఎక్కడా ఫలించలేదు. దీంతో 2019 లో వచ్చిన విజయం కన్నా ఘోరంగా ఇప్పుడు వైసీపీ ఓటమి దిశగా పయనిస్తుండడం గమనార్హం. మరి దీనిని బట్టి.. సంతృప్తి లేని సంక్షేమంగానే వైసీపీ సర్కారు నిలిచి పోయిందని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates