తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నికలలో అసలు పోటీ చేయకుండానే పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప ఎంపీగా పోటీ పోటీ చేసిన వైఎస్ షర్మిల ఘోర పరాజయం దిశగా సాగుతున్నది. అసలు ఆమెకు డిపాజిట్ కూడా దక్కడం లేదు. అన్న మీద కోపంతో రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల తన గెలుపుకన్నా జగన్ పార్టీ ఓటమికి ఎక్కువగా ఉపయోగపడ్డారని ఎన్నికల ఫలితాల సరళిని బట్టి తెలుస్తుంది.
ఇప్పటి వరకు వెల్లడయిన ఓట్ల లెక్కల ప్రకారం కడప ఎంపీగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి 1,93,621 ఓట్లతో 29,834 ఆధిక్యంలో ఉండగా, టీడీపీ అభ్యర్థి చడిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి 1,63,787 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల కేవలం 43,061 ఓట్లకు పరిమితం అయింది. ఈ లెక్కన షర్మిలకు డిపాజిట్ దక్కే అవకాశంలేదని అర్ధం అవుతుంది.
తెలంగాణలో పాలేరు నుండి శాసనసభ్యురాలిగా పోటీ చేస్తానని షర్మిల అక్కడ ఓ ఇల్లుకు కూడా పునాది పోసింది. కానీ పార్టీ పెట్టిన తర్వాత అసలు ఎక్కడా పోటీ చేయకుండా పార్టీనే ఎత్తివేయడం విశేషం. ఇప్పుడు సొంత జిల్లా కడపలో పోటీ చేసి ఘోర పరాజయం పొందడం జీర్ణించుకోలేని అంశమే.