ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ కూటమి దూసుకుపోతుండడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిపార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు.. సంబరాలకు దిగారు. ఒకవైపులీడ్స్ వస్తుండడం.. టీడీపీ కూటమి నేతలు.. ముందంజలో ఉండడంతో తమ్ముళ్లలో సంతోషం వ్యక్తమవుతోంది.
తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి.. లీడ్‌లు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తొలి రౌండ్ లో ఆధిక్యం 4300తో
ఉండిలో రఘురామరాజు ఆధిక్యం లోఉన్నారు.
మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. 2 వేల ఓట్లకు పైగా లీడ్‌లో ఉన్నారు..
అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం కనిపిస్తోంది.
విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ఆధిక్యం ఉన్నారు.
బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబి నాయన ఆధిక్యంలో ఉన్నారు
తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్ ఆధిక్యం లో ఉన్నారు.
ముమ్మడివరంలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
టెక్కలి టీడీపీ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు ఆధిక్యం లో ఉన్నారు.
ఆముదాలవలస కూన రవికుమార్ టీడీపీ ఆధిక్యంలో ఉన్నారు..
జగ్గంపేటలో 3550 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం
రాజమండ్రి రూరల్ లో 5 వేలు దాటిన బుచ్చయ్య లీడ్ లో ఉన్నారు.
తిరువూరు(ఎస్సీ)లో కొలికపూడి శ్రీనివాసరావు ఆధిక్యం
మైదుకూరులో తొలిసారి 20 ఏళ్ల తర్వాత.. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యం లో ఉన్నారు.
కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి ఆధిక్యంలో ఉన్నారు.. ఈమె టీడీపీ అభ్యర్థి అయిన విషయం తెలిసిందే.
నగరిలో రోజా వెనుక బడ్డారు.
కీలకమైన గుడివాడలో మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్.. కొడాలి నాని వెనుకబడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము దూసుకుపోతున్నారు
పూతలపట్టులో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.
ఎంపీ స్థానాల్లో..
నెల్లూరు ఎంపీ స్థానంలో టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం లో ఉన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ఆయన సోదరుడు వైసీపీ నేత కేశినేని నాని వెనుకబడ్డారు.
తిరుపతిలో బిజెపి అభ్యర్ధికి ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ బరిలో ఉన్నారు.
రాజమండ్రిలో 1800 ఓట్లతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి లీడ్ లో ఉన్నారు..
This post was last modified on June 4, 2024 9:39 am
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…
గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్…