ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు కారణమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయాలు.. సర్వత్రా ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ కోసం .. అందరూ ఎదురు చూశారు. తాజాగా శనివారం సాయంత్రం 6.30 తర్వాత.. పలు సంస్థలు ఆయా వివరాలు వెల్లడించాయి. అయితే.. మెజారిటీ సంస్థలు.. కూటమి(టీడీపీ+బీజేపీ+జనసేన)కే జై కొట్టాయి. ఆ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. దాదాపు 12-15 సంస్తలు చేసిన సర్వేల్లో మెజారిటీ సంస్థలు.. కూటమి పక్షానే నిలవడం గమనార్హం.
ఇదీ.. ఎగ్జిట్ పోల్(అసెంబ్లీ)
ఏపీబీ సీ ఓటర్: ఎన్డీఏ కూటమికి 52.9 శాతం ఓట్లు, వైఎస్సార్ సీపీ 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు, ఇతరులు 2.1 శాతం ఓట్లు.
పీపుల్స్ పల్స్: టీడీపీ 95 -110, వైసీపీ 45 -60, జనసేన 14 – 20, బీజేపీ 2 – 5
కేకే సర్వీస్: టీడీపీ 133, వైసీపీ – 14, జనసేన – 21, బీజేపీ – 7
చాణక్య స్ట్రాటజీస్: టీడీపీ కూటమి 114 – 125, వైసీపీ 39 – 49, ఇతరులు 0-1
పయనీర్: టీడీపీ కూటమి- 144, వైసీపీ 31
రైజ్: టీడీపీ కూటమి 113 – 122, వైసీపీ 48 – 60, ఇతరులు 1