జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని.. ఆయన పిఠాపురంలో గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వారు తమ అభిమాన నాయకుడి విజయంకోసం.. మొక్కుల కూడా మొక్కుతున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఓ లేడీ డాక్టర్ కూడా చేరిపోయారు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన డాక్టర్ రామలక్ష్మి.. ఆర్ ఎంపీ డాక్టర్. ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం. అలాగని పార్టీల పరంగా కాదు. నటన పరంగా ఆయనంటే ఎంతో ఎనలేని మక్కువ.
ఈ నేపథ్యంలో డాక్టర్ రామలక్ష్మి.. తాజాగా ముగిసిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం దక్కించుకోవాలని కాంక్షిస్తూ.. ఏకంగా.. తిరుమల శ్రీవారి ఏడు కొండల మెట్లు ఎక్కారు.
అది కూడా.. సాధారణ పాదాలతో కాదు.. మోకాళ్లపై ఎక్కి మరీ మొక్కు తీర్చుకున్నారు. వాస్తవానికి మోకాళ్లపై కొంత దూరం వరకు నడవాలం టేనే మనకు ఇబ్బంది. అలాంటిది.. ఏడు కొండల మెట్లను మోకాళ్లపై ఎక్కడం అంటే.. మామూలు విష యం కాదు. అయినప్పికీ రామలక్ష్మి దీనిని సాధించారు.
వాస్తవానికి మే 25నే తన మొక్కు తీర్చుకున్న రామలక్ష్మి తాజాగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించా రు. ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయం సాధించాలి. అందుకే తిరుమల శ్రీవారిని మెక్కుకున్నా. అందులో భాగంగానే 450 మెట్లు మోకాళ్లపై ఎక్కి మొక్కు తీర్చుకున్నా. పార్టీలతో నాకు సంబంధం లేదు. కేవలం పవన్ పై ఉన్న అభిమానంతోనే ఇలా చేశా ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని డాక్టర్ పసుపులేటి రామలక్ష్మి వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates