వైసీపీని వ‌ణికిస్తున్న ఎగ్జిట్ పోల్స్‌!

ఈ సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే వైసీపీ నేత‌ల‌కు అర్థ‌మైపోయింది. కానీ బ‌య‌ట‌కు మాత్రం త‌మ పార్టీనే గెలుస్తుంద‌ని, జ‌గ‌న్ రెండోసారి సీఎం అవుతార‌ని గొప్ప‌లు చెబుతోంద‌నే టాక్ ఉంది.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి వైసీపీ ఏం చెప్పినా చెల్లుతోంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ శ‌నివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి కానుండ‌టంతో వైసీపీ నేత‌లు వ‌ణుకుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ తో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుందని అంటున్నారు.

జూన్ 1తో దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగుస్తున్నాయి. దీంతో సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి కానున్నాయి. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. ఈ పోల్స్‌లో వ‌చ్చే ఫ‌లితాలను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి నెల‌కొంది.

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా నిజ‌మ‌య్యేలాగే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే ఆస్కార‌ముంది. ఈ నేప‌థ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌పై నెగెటివ్ ప్ర‌చారానికి దిగేందుకు వైసీపీ సిద్ధ‌మైంద‌ని తెలిసింది. ఇప్పటికే ఎన్నిక‌లు జ‌రిగిన తీరు, పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిబంధ‌న‌ల‌పై ఎన్నిక‌ల సంఘంపై వైసీపీ విమ‌ర్శ‌లు చేసింది.

ఇప్ప‌డు ఎగ్జిట్ పోల్స్‌కు త‌మ‌కు వ్య‌తిరేకంగా వ‌స్తాయ‌ని భావించి వీటిపై నెగ‌టివ్ ప్ర‌చారానికి వైసీపీ రెడీ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో నిజం లేద‌ని, మ‌రోసారి వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే ప్ర‌చారం చేసుకునేందుకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసుకుంద‌ని తెలిసింది.

త‌మ‌కు అనుకూల మీడియాలో, సామాజిక మాధ్య‌మాల్లో ఈ మేర‌కు ప్ర‌చారం చేప‌ట్టే అవ‌కాశ‌ముంది. అయినా ఎంత చేసినా వైసీపీ ఓట‌మి అనేది ఖాయ‌మైంద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.