దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని ఆయా లోక్ సభ నియోజకవర్గాలలో పోటీని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అందులో ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ తరపున ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుండి హిమాచల్ కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నాడు.
గత రెండు లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ రాజకుటుంబీలకు పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆ లెక్కన ఈ సారి విజయం విక్రమాదిత్యదే అంటున్నారు. అయితే తొలిసారి బీజేపీ ఈ స్థానం నుండి మహిళను పోటీకి దింపిన నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందా ? అని భావిస్తున్నారు.
బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ కులు మహేశ్వర్ సింగ్, మాజీ కేంద్రమంత్రి సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ కంగనాకు మద్దతుగా నిలబడడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నికల కోసం కంగనా నెల రోజుల పాటు రాజకీయాలు చేసేందుకు వచ్చిందని, ఎన్నికలు అయిపోగానే సూట్ కేసు సర్దుకుని బాలీవుడ్ కు వెళ్లిపోతుందని విక్రమాదిత్య తీవ్ర విమర్శలు చేస్తున్నాడు.
విక్రమాదిత్య విమర్శలకు ధీటుగా కంగనా స్పందిస్తుంది. చోటా పప్పు అని విమర్శిస్తూ “2023 లో పెద్ద ఎత్తున వరదలు వస్తే, హిమాచల్ ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, మండి యూనివర్శిటీ, 250 కోట్ల శివధన్ ప్రాజెక్టులను నిలిపేస్తే” ఏం చేశావని ప్రశ్నించింది. అయితే ఢిల్లీ సరిహద్దులలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడినప్పుడు కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెకు ప్రతికూలంగా మారాయి. రైతు సంఘాలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండిలో కంగనా ‘కంగు’మంటుందా ? ‘ఖంగు’తింటుందా ? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
This post was last modified on May 19, 2024 3:07 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…