జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద దీరుతున్నారు. ఇది త‌ప్పుకాదు.

55 రోజుల పాటు నిర్విరామంగా ప్ర‌చారం చేసి.. ఎండ‌ల్లో మ‌ల‌మ‌ల మాడిన నాయ‌కుల‌కు ఇప్పుడు ఒకింత రిలాక్స్ అయ్యే చాన్స్ లభించింది. కానీ, ఇది ఇత‌ర పార్టీలు,నాయ‌కుల విష‌యంలో ఒకింత సేద‌దీరేందుకు అవ‌కాశం ల‌భించింద‌ని అనుకున్నా.. బాధ్య‌తా యుత‌మైన ముఖ్య‌మంత్రి(ఆప‌ద్ధ‌ర్మ కొవొచ్చు) స్థానంలో ఉన్న నాయ‌కుల‌కు మాత్రం కాదు. ఎందుకంటే..ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగే క్ర‌మంలో అన్నీ కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే చూసుకోదు.

కొన్ని కొన్ని కీల‌క విష‌యాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా జోక్యం చేసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌.. ఎండ వేడి త‌గ‌ల‌కుండా చూసుకోవ‌డం.. తాగునీటి వ‌స‌తిని అందించ‌డం.. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఓట‌ర్ల‌కు ర‌వాణా స‌దుపాయం ఏర్పాటు చేయ‌డంలో లోటు పాట్లు లేకుండా చేయ‌డం వంటివి.. ముఖ్య‌మంత్రి స్థాయి అధికారులు చూసుకోవ‌చ్చు. ఇది ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు కూడా వ్య‌తిరేకం కాదు. కానీ, ఈ విష‌యంలో జ‌గ‌న్ పూర్తి చేతులు ఎత్తేసిన‌ట్టు క‌నిపిస్తున్నారు. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత‌.. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సైలెంట్ అయ్యారు.

అయితే.. ఇదే స‌మ‌యంలో టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబు మాత్రం .. ఇంకా శ్ర‌మిస్తూనే ఉన్నారు. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి, రాష్ట్రాల ఉంచి ఏపీకి వ‌చ్చి ఓటేయాల‌ని భావిస్తున్న‌వారికి.. స‌దుపాయాలు క‌ల్పించాలంటూ. ఆయ‌న సీఎస్‌కు లేఖ రాశారు. అదేవిధంగా ఆర్టీసీ బ‌స్సులు ఏర్పాటు చేయాల‌ని ఆర్టీసీ ఎండీకి కూడా లేఖ‌లు రాశారు.

అంతేకాదు.. ప్ర‌తి రెండుమూడు గంట‌ల‌కు ఒక‌సారి ఆర్టీసీ ఎండీతోనూ.. ఇత‌ర ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తోనూ చంద్ర‌బాబు ట‌చ్‌లో ఉంటూ.. బ‌స్సుల ఏర్పాటు, సౌకర్యాలు వంటివాటిని తెలుసుకుంటున్నారు. త‌న సూచ‌న‌లు కూడా అందిస్తున్నారు.

చిత్రం ఏంటంటే.. వారు కూడా చంద్ర‌బాబు సూచ‌న‌లు పాటిస్తుండ‌డం.. ఆయ‌న‌కు స‌మాధానం చెబుతుండ‌డం. ఇదీ.. సంగ‌తి. ఇక‌, ఈ విష‌యం తెలిసిన వారు.. చంద్ర‌బాబు సీఎం అయిపోయారా? అని కామెంట్లు పెడుతున్నారు.