హైదరాబాదు నుంచి మండపేట వైపు కెమికల్ ఫౌడర్ బస్తాలను తరలిస్తున్న వ్యాన్ ను లారీ ఢీ కొట్టడంతో తిరగబడింది. అందులో ఉన్న బస్తాల కింద 7 అట్ట పెట్టెలు లభ్యం అయ్యాయి. వాటిల్లో పెద్ద ఎత్తున నగదు ఉండటం కలకలం రేపుతున్నది.
వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు. అధికారుల సమక్షంలో అన్ని పెట్టెలను తెరిచి చూడగా వాటిలో 7 కోట్ల రూపాయల నగదు కనిపించింది. ఇది ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్న నగదుగా అధికారులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో దొరికిన ఈ డబ్బు ఎవరిది ?ఎక్కడికి తరలిస్తున్నారనే కోరణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ?
యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్న కానిస్టేబుల్ ప్రమాదఘటన వద్దకు వచ్చి చూశాడు. అక్కడ కెమికల్ పౌడర్ బస్తాల నడుమ అట్టపెట్టెలు కనిపించగా అనుమానం వచ్చి చూడగా భారీ ఎత్తున నగదు కనిపించింది. దీంతో భయపడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates