ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు.
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలోనూ పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇక్కడ సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే సిటింగ్ ఎమ్మెల్యేను ఓడించే స్థాయికిసుధీర్ ఎదిగాడని, ఇక్కడ టీడీపీకి అనుకూల పవనాలే వీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసుడిగా సుధీర్ రాజకీయ ప్రవేశం చేశారు. అయితే శ్రీకాళహస్తిలో సుధీర్‌ను కాదని ఇతరులకు టికెట్ ఇవ్వాలని బాబు మొదట అనుకున్నా.. వైసీపీ ఎమ్మెల్యేను ఢీకొట్టే సత్తా ఆయనకే ఉందని పోటీలో నిలబెట్టారు.
అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సుధీర్ విజయం దిశగా సాగుతున్నారు. సుధీర్‌కు మొదట కూటమి నేతల నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కానీ అందరితో మాట్లాడి తనవైపు తిప్పుకున్నారు. జనసేన, బీజేపీ నేతలు కూడా ఇప్పుడు సుధీర్ గెలుపు కోసం పని చేస్తున్నారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై జనాల్లోనే కాదు సొంత పార్టీ నేతల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ అయిదేళ్లలో ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలు అంటున్నారు.
మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోని మధుసూదన్ కోసం ఇప్పుడు ఎందుకు పని చేయాలంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రచారంలో మధుసూదన్ వెనుకబడ్డారని టాక్.
ఎంత నచ్చజెప్పినా ఆయన కోసం పని చేసేందుకు వైసీపీ శ్రేణులు ముందుకు రావడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ విజయం ఖాయమనే అంచనాలు కలుగుతున్నాయి.