అయ్యో.. రోజాకు ఎంత కష్టమొచ్చింది! అసలే నగరి నియోజకవర్గంలో ఆమెపై వ్యతిరేకత. పైగా సొంత వైసీపీ నేతలే ఆమె ఓటమి కోసం పని చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా అన్ని ప్రతికూలతల మధ్య జగన్ సభతోనైనా జోష్ వస్తుందేమో అనుకుంటే అది కూడా జరగలేదు.
నగరిలో ప్రచారం కోసం జగన్ వచ్చినా రోజా సినిమా అట్టర్ ఫ్లాపే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సభకు అంతంతమాత్రంగానే జనాలు రావడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.
నగరిలో వైసీపీ నాయకులు తనకు మద్దతు తెలపకపోయిన ఫర్వాలేదు అధినేత జగన్ అండదండలు ఉంటే చాలని మంత్రి రోజా అనుకుంటున్నారు. జగన్‌ను చూసి తనకు జనాలు ఓట్లు వేస్తారనే భ్రమలోనే ఉన్నారనే టాక్ ఉంది.
కానీ నగరిలో సీఎం జగన్ సభతో రోజాకు మబ్బులు వీడిపోయాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ వచ్చినా జనాలు రాకపోవడంతో తనకు ఓటమి తప్పదనే క్లారిటీకి రోజా వచ్చారని తెలిసింది. ఈ నియోజకవర్గంలోని అయిదు మండలాల్లోనూ కీలక వైసీపీ నాయకులు రోజా తీరుతో విసిగిపోయి ఆమెకు మద్దతుగా ప్రచారం చేయడం లేదని సమాచారం.
అసలు రోజాకు మరోసారి టికెట్ ఇవ్వొద్దనే ఈ నాయకులు జగన్‌ను కోరారు. కానీ రోజా నోరు పెద్దది కావడంతో జగన్ టికెట్ ఇవ్వక తప్పలేదని సమాచారం. టికెట్ తెచ్చుకున్నా రోజాను కచ్చితంగా ఓడిస్తామని వైసీపీ నాయకులే బహిరంగంగా చెప్పారు. అయినా జగన్ అభయంతో రోజా ప్రచారంలో సాగుతున్నారు. పుత్తూరు సభను భారీగా విజయవంతం చేయాలనుకున్నారు. జనాలను తరలించారు. కానీ జగన్ ప్రసంగం వినడానికి ప్రజలు ఆసక్తి చూపలేదని తెలిసింది. వాళ్లు వాహనాలు దిగలేదని సమాచారం.
జగన్ మాట్లాడుతుండగానే చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక జగన్ వచ్చారని రోజాను వ్యతిరేకిస్తున్న వైసీపీ నాయకులు సభకు వచ్చారే తప్పా ఆమెకు మద్దతు కోసమైతే కాదు. దీంతో రోజా ఆశలు ఆవిరవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.