రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్‌ను ఓడించేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ ప్రతిమండలంలోనూ…. కీలక నేతలను రంగంలోకి దింపి.. పార్టీని పరుగులు పెట్టిస్తోంది. పార్టీ సీనియర్ నాయకురాలు.. వంగా గీత గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. దీనికి ముద్ర గడ పద్మనాభం కూడా తోడయ్యారు.
ఈయనను తనవైపు తిప్పుకొన్న.. వైసీపీ ఆయనతోనే.. ఇక్కడ పొలిటికల్ గేమ్‌కు తెరదీసింది. పవన్‌ను ఓడించాలంటే.. బలమైన కాపు ఉద్యమ నాయకుడు అవసరం అనుకున్నారో.ఏమో.. సీఎం జగన్ షెడ్యూ ల్ విడుదలకు ముందు ఆయనను పార్టీలో కి చేర్చుకున్నారు. ఇక, పద్మనాభం కూడా.. తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. పవన్‌పై చిర్రుబుర్రులాడుతున్నారు. తనను అవమానించారంటూ.. మొదలు పెట్టిన ఆయన మాటల యుద్ధం.. చివరకు.. పవన్‌ను ఓడించి తీరుతానని శపథం చేసే వరకు వచ్చింది.
అక్కడితోకూడా ముద్రగడ ఆగలేదు.. పవన్‌ను ఓడించకపోతే.. తనపేరును `పద్మనాభంరెడ్డి`గా మార్చు కుంటానని చెప్పారు. ఇంత కసిపై ఉన్న ఆయనకు ఎవరు సహకరిస్తున్నారో.. లేదో చెప్పడం కష్టమే అయినా.. ఇప్పుడు ఆయన కుటుంబంలోనే కల్లోలం రేగింది. ముద్రగడ కుమార్తె క్రాంతి ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను ఓడిస్తానని చెబుతున్న ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. జగన్.. తన తండ్రిని నమ్ముకుని నట్టేట మునుగుతున్నారని క్రాంతి వ్యాఖ్యాలు చేశారు.
“పవన్‌ను తిట్టేందుకే మా నాన్నను సీఎం జగన్ వాడుకుంటున్నారు. ఇది సరికాదు. ఎన్నికల తర్వాత.. మా నాన్న ఎటూ కాకుండా పోతారు“ అని క్రాంతి ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ఓడించేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్న ఆమె.. తన తండ్రి చేసిన శపథాన్ని తప్పుబట్టారు. తాను మాత్రం పవన్ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పడం గమనార్హం. అయితే.. ఇలా ముద్రగడ కుటుంబంలో చీలిక రావడంఅందరినీ విస్మయానికిఆశ్చర్యానికి కూడా గురిచేస్తోంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.
This post was last modified on May 3, 2024 12:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…