ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి.. ఉగాది పూజల్లో పాల్గొన్నారు. పండితుల వేద ఆశీర్వచనం తీసుకున్నారు. నెత్తిన అక్షతలు కూడా జల్లించుకున్నారు. ఇవన్నీ పూర్తిగా హిందూ సంప్రదాయానికి చెందినవనే విషయం తెలిసిందే. అయితే.. ఆమె ఎప్పుడూ.. ఇలా హిందూపూజల్లో నేరుగా పాల్గొనలేదు. సంక్రాంతి వంటి సంబరాల్లో పాల్గొన్నా.. జగన్ ఒక్కరే పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇక, వివిధ మతాచార్యలు కలిసినా.. జగన్ ఒక్కరినే ఆశీర్వదించి వెళ్లిపోతారు. కానీ, తాజాగా ఉగాది వేడుక ల్లో వైఎస్ భారతి పాల్గనడమే కాకుండా.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆశీర్వచనం తీసుకోవడం అక్ష తలు వేయించుకోవడం గమనార్హం. ప్రస్తుతం మేం సైతం సిద్ధం ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఉగాది సందర్భంగా అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతు లు స్వీకరించారు.(గతంలో భారతి ఇలా తీసుకోకపోవడం గమనార్హం.) అనంతరం. పండితులు సీఎం దంపతులకు శాలువా కప్పి, అక్షతలు చల్లి ఆశీర్వాదం పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొసమెరుపు: గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖాన బొట్టు పెట్టడం.. ఆశీర్వచనం తీసుకోవడం.. వంటివాటిని రికార్డు చేసి మరీ మీడియాకు విడుదల చేయడం గమనార్హం. మొత్తంగా ఎన్నికల నేపథ్యంలో అందరినీ మచ్చిక చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇలా చేశారన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం. దీనిపై బీజేపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.