ఏపీలో వలంటీర్ల వ్యవస్థ.. ఇటీవల కాలంలో రాజకీయంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. వలంటీర్లను పింఛన్ల పంపిణికీ, ప్రభుత్వ పథకాల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. అధికార పార్టీ నాయకులు.. దీనిని టీడీపీ నేతలపైకి నెట్టేశారు. దీంతో చంద్రబాబు కారణంగానే వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయడం లేదనే విషయం చర్చకు వచ్చింది. అయితే.. దీనిని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు, టీడీపీ నాయకులు చాలానే శ్రమించారు.
ప్రస్తుతం ఈ వ్యవస్థపై చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఉగాది వేడుకల్లో ప్రసం గించిన చంద్రబాబు వలంటీర్లకు సీరియస్‌గా కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వలం టీర్లను రాజీనామా చేయాలని.. తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలని ఒత్తిడి తెస్తోందని.. వలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు న్న ప్రతి వలంటీరును రేపు తాము అధికారంలోకి వచ్చాక కొనసాగిస్తామన్నారు.
ఎక్కడా ఏ ఒక్కరినీ తొలగించబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే.. వైసీపీకి అనుకూలంగా మా త్రం పనిచేయొద్దని.. ప్రజల కు మాత్రమే సేవ చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం జగన్.. విష ప్రచారం చేస్తున్నారని.. వలంటీర్ వ్యవస్థ రద్దయినట్టుగా ఆయన చెబుతున్నారని, కానీ, వ్యవస్థ రద్దు కాలేదని చంద్రబాబు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక.. వలంటీర్ల వేతనాలుపెంచడంతో పాటు వారికి మెరుగైన శిక్షణ కూడా ఇస్తామన్నారు. ప్రజలకు మరింత చేరువై సేవలు చేయాలని వలంటీర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
“వలంటీర్ల వ్యవస్థపై జగన్ చిందులు తొక్కుతున్నాడు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేశావా ? ముందు చెప్పు. రహస్య జీవో ఏమైనా ఇచ్చావా? రద్దు చేశావా? చెప్పాలి. వలంటీర్ వ్యవస్థపై రాజకీయాలు చేస్తున్నావు. రాజీనామాలు చేసి పార్టీకి సేవ చేయాలని ఒత్తిడి చేస్తున్నావు“ అని జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చాక వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. సీఎం జగన్ ఎంత స్వార్థ పరుడో.. వలంటీర్లు అర్ధం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. పండుగ రోజు తీపికబరు ఇస్తున్నామని చెప్పారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలకు పెంచుతామన్నారు.
This post was last modified on April 9, 2024 4:06 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…