పెద్దిలో ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. చికిరి చికిరి ప్యాన్ ఇండియా స్థాయిలో రీచ్ అయిపోగా రైరైరా రయ్ సాంగ్ కన్నా ఎక్కువ రామ్ చరణ్ స్టెప్పులు సోషల్ మీడియాని ఊపేశాయి. తర్వాత ట్రైలర్ వచ్చింది కానీ మిశ్రమ స్పందన వల్ల అభిమానులు ఐటెం సాంగ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. నిన్న భోపాల్ ఈవెంట్ లో లాంచ్ జరిగినప్పటికీ ఆన్ లైన్ లో ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. లిరికల్ కాదు వీడియో రూపంలో వదిలారు.
రామ్ చరణ్, శృతి హాసన్ జంటతో మొదలైన పాట సగమయ్యాక జాన్వీ కపూర్ తోడవ్వడంతో కొత్త ఫ్లేవర్ అందుకుంది. అయితే హై ఎనర్జీలో గత రెండు పాటలు చూశాక ఇది కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చే మాట వాస్తవమే కానీ స్క్రీన్ మీద పూర్తి పాటను చూస్తూ ముగ్గురి స్టెప్పులను ఎంజాయ్ చేస్తూ కలిగే మాస్ ఫీలింగ్ వేరే ఉంటుంది. అప్పట్లో రంగస్థలం నుంచి జిగేలు రాణి రిలీజ్ కాగానే యునానిమస్ అనిపించుకోలేదు. తెరమీద ఎక్స్ పీరియన్స్ అయ్యాక లుక్ మారిపోయింది.
ఇప్పుడీ హల్లల్లాలో హల్లో కూడా అదే క్యాటగిరీలో చేరుతుందేమో చూడాలి. మూడు గంటల తొమ్మిది నిమిషాల నిడివి ఉన్న సినిమాలో దర్శకుడు బుచ్చిబాబు కేవలం నాలుగు పాటలే పెట్టడం చూస్తే కంటెంట్ ఏదో సాలిడ్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల పరంగా పెద్ది వేయబోయే ప్రతి అడుగు కీలకం కానుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన పెద్ది బృందం దానికి అనుగుణంగా ప్లాన్లు వేస్తోంది.
ఎవడులో జంటగా నటించాక రామ్ చరణ్, శృతి హాసన్ కలిసి స్క్రీన్ పంచుకోవడం పెద్దిలోనే జరిగింది. ముందు ఏవేవో పేర్లు అనుకుని అవేవి కుదరక ఫైనల్ గా శృతిని లాక్ చేసుకున్నారు బుచ్చిబాబు. అది కూడా ప్రొడక్షన్ చివరి స్టేజిలో మంచి ఒత్తిడి మీద ఉన్నప్పుడు షూట్ జరిగింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. ఈ ఒక్క పాట కోసమే యాభై రోజులు పట్టిందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే
Gulte Telugu Telugu Political and Movie News Updates