ఏపీ సీఎం జగన్పై ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జగన్ ఎట్టి పరిస్థితిలోనూ గెలిచేది లేదని మరోసారి చెప్పారు. తాజాగా హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవ లం ప్రొవైడర్గానే జగన్ మిగిలిపోయారని పీకే తెలిపారు. కనీసం ఉద్యోగాలు.. ఉపాధి కల్పించడంలోనూ జగన్ విఫలమయ్యారని అన్నారు. ప్రజలకు డబ్బులు పంచడం ద్వారా ఎన్నికల్లో గెలిచేద్దామని జగన్ భావిస్తున్నారని కానీ, ఇది సాధ్యం కాదని పీకే చెప్పారు. ఇలాంటి ఘటనలు దేశంలో అనేకం ఉన్నాయన్నారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను కేవలం పుచ్చుకునేవారిగా, తాను ఇచ్చేవాడిగా మాత్రమే చూసుకున్నారని.. ఇది ఒకరకంగా ప్రజలను చేతులు చాచి నిలబడేలా చేసిందని పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజ్యాలను పాలించిన చక్రవర్తులు కూడా తమ పుట్టిన రోజులు, పెళ్లి రోజుల నాడు ప్రజలకు ఇలానే పంచేవారని అన్నారు. జగన్ కూడా కొన్ని డేట్లు పెట్టి ఇలానే పంపకాలు చేస్తున్నారని పీకే చెప్పుకొచ్చారు. కానీ, ఇవి ఓట్లు తెచ్చిపెట్టవని, దీనివల్ల జగన్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు.
“ఏపీ ప్రజలు ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటున్నారు. సంక్షేమాన్ని అమలు చేయడం ఎవరైనా చేయగలరు. కానీ, అభివృద్ధి కావాలంటే.. కొంత మార్పు ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే ఈ ఎన్నికలను చూడాల్సి ఉంటుం ది“ అని పీకే వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ది లేదనేది అందరూ చెబుతున్న మాటేనని.. తాను కూడా దీనితో ఏకీభవిస్తా నని అన్నారు. మార్పు ఎప్పుడైనా రావొచ్చన్నారు. ఇక, వలంటీర్ల వ్యవస్థ పూర్తిగా రాజకీయం అయినందుకే వివాదంగా మారిందన్నారు. వలంటీర్లు ప్రభుత్వాన్ని నిర్ణయించలేరన్నారు.
ఉద్యోగాలు లేక ఏపీ నుంచి వలసలు పెరుగుతున్నాయని పీకే చెప్పారు. హైదరాబాద్లో పనిచేసుకుంటున్న వారిలో ఒకప్పుడు బిహార్, యూపీ వంటి రాష్ట్రాల యువత ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు ఏపీ యువతకు దీనికి రెండురెట్లు ఎక్కువగా ఉందని పీకే చెప్పారు. జగన్ సోదరీమణులు షర్మిల, సునీతల విషయం తనకు తెలియదని చెబుతూనే.. వారి ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates