కార్ క‌న్‌ఫ్యూజ్ పోయినట్టే

ఎన్నిక‌లు అన‌గానే.. పార్టీలు, నాయ‌కులు ఎంత మంది ఉన్నా.. హోరా హోరీగా ప్ర‌చారం చేసుకున్నా.. చివ‌ర‌కు వీరంతా ఆధార‌ప‌డేది.. వీరి జ‌తకాలు తేల్చేది… ఎన్నిక‌ల గుర్తులే. అందుకే నాయ‌కులు.. ఎన్నిక‌ల్లో ఎంత పోరాటం చేసినా.. చివ‌ర‌కు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేస‌రికి పేర్లు మ‌రిచిపోయినా ఫ‌ర్లేదు..కానీ గుర్తును మాత్రం మ‌రిచిపోవ‌ద్ద‌ని ప‌దే ప‌దే చెబుతుంటారు. మ‌న గుర్తు.. మ‌న గుర్తు అంటూ.. పెద్ద ఎత్తున గుర్తునే ప్ర‌చారంలోకి తీసుకువ‌స్తారు.

ప్ర‌ధాన పార్టీల‌కు ఏ ఎన్నిక‌లు అయినా ప‌ర్మినెంట్ గుర్తులు ఉండాయి. ఈ పార్టీల గుర్తుల విష‌యంలో ఓట‌ర్ల‌కు పెద్ద క‌న్‌ఫ్యూజ్ ఉండ‌దు. ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల గుర్తుల విష‌యంలో ప్ర‌చారం చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అయితే ఇండిపెండెంట్ల‌కు వ‌చ్చే గుర్తులు ఒక్కోసారి ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల గెలుపు ఓట‌ముల‌ను తారుమారు చేస్తోన్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఈ గుర్తుల వ‌ల్ల ప్ర‌ధాన పార్టీలు గ‌గ్గోలు పెట్టేస్తుంటాయి. అయితే.. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ఎన్నిక‌ల గుర్తుల‌పై నిషేధం విధించింది.

వీటిలో ఆటో రిక్షా, చ‌పాతి క‌ర్ర‌, రోడ్డు రోర‌ల్‌, ఎండ‌కు పెట్టుకునే టోపీ, ట్ర‌క్కు, ఐర‌న్ బాక్స్ వంటివాటిని గుర్తులుగా ఎవ‌రికీ కేటాయించ‌బోమ‌ని తాజాగా ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఈ గుర్తుల‌ను ఎవ‌రికీ కేటాయించ‌బోరు. నిజానికి ఈ ఆదేశాలు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం అవుతున్నాయి. ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ గుర్తులు మ‌నుగ‌డ‌లో ఉంటాయ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

రీజ‌న్ ఏంటి..?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ గుర్తుల‌ను కాద‌న‌డానికి కార‌ణం.. ప్ర‌ధాన పార్టీలు అంటే.. గుర్తింపు పొందిన పార్టీలైన‌.. బీఆర్ ఎస్ తెలంగాణ‌లో, వైసీపీ ఏపీలో కొన్ని ఫిర్యాదులు చేసింది. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. బీఆర్ ఎస్ పార్టీ ఎన్నిక‌ల గుర్తు.. కారు, అయితే.. రోడ్ రోర‌ల్‌, ఆటో రిక్షా.. వంటివి.. కారు గుర్తును పోలి ఉంటున్నాయి. దీంతో నిర‌క్ష్య‌రాస్యులు, వృద్ధులు పొర‌పాటుగా.. కారుకు వేయాల్సిన ఓటును రోడ్ రోర‌ల్‌, ఆటోరిక్షా వంటివాటిపై గుద్దే స్తున్నారు. దీంతో బీఆర్ ఎస్‌కు భారీ డ్యామేజీ జ‌రుగుతోంది. 2014లో ఈ గుర్తుల వ‌ల్లే బీఆర్ఎస్ కొన్ని సీట్ల‌ను స్వ‌ల్ప తేడాతో కోల్పోయింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌, వైసీపీ కూడా త‌మ ఎన్నిక‌ల గుర్తు ఫ్యాన్‌గా పెట్టుకుంది. అయితే.. చ‌పాతీక‌ర్ర‌..(రెండు రెక్క‌లు ఉన్న‌ట్టుగా ఉంటుంది), క్యాప్‌( ఒక రెక్క ఉన్న‌ట్టుగా ఉంటుంది), ఐర‌న్ బాక్స్ వంటివాటితో త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని ఫిర్యాదు చేసింది. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఈ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక ల‌షెడ్యూల్ విడుద‌ల‌కు ముందే వైసీపీ ఫిర్యాదులు అందించింది. దీంతో ఎన్నిక‌ల సంఘం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆటో రిక్షా, చ‌పాతి క‌ర్ర‌, రోడ్డు రోర‌ల్‌, ఎండ‌కు పెట్టుకునే టోపీ, ట్ర‌క్కు, ఐర‌న్ బాక్స్ వంటివాటిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎవ‌రికీ కేటాయించేది లేద‌ని తేల్చి చెప్పింది.