కొన్ని కొన్ని విషయాలు చాలా కుదిపేస్తాయి. అవి వ్యక్తులనైనా, వ్యవస్థలనైనా.. పార్టీలనైనా. ఇప్పుడు జనసేన కూడా ఇదే జాబితాలో పడిపోయింది. తాజాగా పార్టీ గుర్తుపై మరో సారి తీవ్ర కలకలం రేగింది. కీలకమైన ఎన్నికల సమయంలో “జనసేన ఎన్నికల గుర్తుగా ఉన్న గ్లాస్”ను కేంద్ర ఎన్నికల సంఘం ‘ఫ్రీ సింబల్’గా ప్రకటించేసింది. అంటే.. ఈ గుర్తును ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా కోరుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. ప్రస్తుతం ఎన్నికల సంఘం.. ఎవరు ముందు వస్తే వారికి ఫ్రీసింబల్ కేటాయిస్తోంది.
దీంతో ఇప్పుడు కనుక.. జనసేన తక్షణం స్పందించకపోతే.. ఈ గుర్తును మరోపార్టీ కోరుకుంటే.. దానికి ఎన్నికల సంఘం కేటాయించేస్తుంది. అది కూడా ఏపీలో అయితే.. మరింత ఇబ్బంది తప్పదు. తర్వాత.. ఏ న్యాయ పోరాటం చేసినప్పటికీ ఫలితం లేదు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన ఒక పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం మరోపార్టీకి ఎవరు ముందు వస్తే వారికి అన్న ప్రాతిపదికన కేటాయించేసింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అంతేకాదు.. దీనిపై విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది.
ఇప్పుడు జనసేన గుర్తు గ్లాస్‌ను ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే.. జనసేన సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. ఇప్పటికిప్పుడు తక్షణ ఊరడింపు దొరకడం సాధ్యం కాదు. అసలు ఏం జరిగిందంటే.. జనసేనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎలాంటి గుర్తింపులేదు. కేవలం ఇది రిజిస్టర్డ్ పార్టీనే. ఏపీలో వైసీపీ, టీడీపీలు మాత్రమే.. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు. దీంతో జనసేనకు ఎప్పటికప్పుడు గుర్తుపై వివాదం వస్తూనే ఉంది. గత తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఆపశోపాలు పడ్డారు.
ఇక, ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం.. గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్(అంటే.. ఎవరు ముందు వస్తే.. వారికి కేటాయించే ప్రతిపాదన)గా పేర్కొంది. ఇదే జరిగితే.. జనసేనకు భారీ డ్యామేజీ ఖాయం. అయితే.. జనసేన ఇప్పుడే న్యాయ వాదులను సంప్రదిస్తున్నట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి. కానీ, ఆన్‌లైన్ లేదా.. ఆఫ్‌లైన్‌లో ఇతర పార్టీలు కోరుకుంటే.. మాత్రం ఇది జనసేనకు మైనస్‌గా మారనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates