ఔను.. రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా చేస్తున్న పనులు చూస్తే.. అందరూ ఇదే మాట అంటున్నారు. అర్చునుడికి పిట్ట కన్ను మాత్రమే కనిపించినట్టు చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ఓటమే కనిపిస్తోంది. దీనిని కొట్టాలి. అధికారం దక్కించుకోవాలి. అయితే.. ఈ క్రమంలో కొన్ని సీట్లు, కొందరు నాయకులు ఆయనకు ఇబ్బందిగా మారారు. దీంతో ఇలాంటి వారిని పార్టీ నుంచి పంపించలేక.. తాను సర్దుబాటు చేసుకోలేక.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలోని పాత గన్నవరం టికెట్‌ను తొలుత చంద్రబాబు చాలా ముచ్చటపడి మహాసేన రాజేష్‌కు ఇచ్చారు.
మంచి వాగ్ధాటి.. వైసీపీపై విమర్శలు చేయగల నేర్పు.. ఏ టాపిక్‌పైనైనా అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం ఉండడంతో రాజేష్ కోరకుండానే ఆయనకు పి. గన్నవరం టికెట్‌ను ఆఫర్ చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో నాయకులు చంద్రబాబును పడనిస్తేనా? వద్దంటే వద్దు.. మనం ఓడిపోయినా ఫర్లేదు కానీ.. ఆయన మాత్రం వద్దని భీష్మించారు. రోజులు, వారాలు చంద్రబాబు నచ్చ జెప్పారు. వెయిట్ చేసి మార్పు కోసం చూశారు. కానీ, ఎక్కడా మార్పు కనిపించలేదు. దీంతో చేతికి మట్టి అంటకుండా.. ఈ సీటును జనసేనకు ఇచ్చేశారు. ఇక, జనసేన కూడా.. చాలా వ్యూహాత్మకంగా ఈ సీటును తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారికి కట్టబెట్టేసింది.
ఇక, అవనిగడ్డ సీటు విషయానికి వస్తే.. ఓటమి అంచుల్లో ఊగిసలాడుతున్న మండలి బుద్ధ ప్రసాద్.. తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కాపులను ప్రభావితం చేసేలా మాట్లాడారు. కానీ, ఆయన గ్రాఫ్ చూస్తే.. ఎం
షేపులో దిగిపోయింది. 2014లోనే అతి కష్టం మీద ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. ఇప్పుడు ఇచ్చినా.. ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు అంచనా వేసుకుని.. ఆయనను తప్పించారు. కానీ, సెగలు పొగలు ఆగలేదు. దీంతో ఈ సీటును కూడా జనసేనకు ఇచ్చేశారు. ఇక్కడ జనసేన అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇలా చేసుకోవడం వల్ల నష్టపోయింది.. మండలి వంటి సీనియర్లే.
ఇక, ధర్మవరం సీటు.. ఈ సీటు మరింత దారుణంగా మారింది. వరదాపురం సూరికి ఇస్తే ఓడిస్తామని నాయకులు ప్రతిజ్ఞలు చేశారు. ముఖ్యంగా యువ నాయకుడు పరిటాల శ్రీరాం.. ఇప్పటికీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోనీ. ఆయనకు ఇస్తే.. గెలిచే పరిస్థితి ఉందా .? అంటే.. కష్టమనే సర్వేలు చెప్పాయి. అయినప్పటికీ.. రెండు పర్యాయాలు చంద్రబాబు ఆయనను పిలిచి మాట్లాడారు. ఇదీ.. నీ పరిస్థితి అని నివేదికలు ఎదురుగా పెట్టి చెప్పారు. అయినా.. మనోడు ఉడుకురక్తం తగ్గించుకోలేదు. ఫలితంగా చడీ చప్పుడు లేకుండా.. అయితే.. బీజేపీ లేకుండా జనసేనకు అన్నట్టుగా చంద్రబాబు తేల్చేశారు. ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. దీనికి కారణం నాయకులు సహకరించకపోవడమనే టాక్ వినిపిస్తోంది. అయితే.. వారిని బయటకు పంపించడం ఇష్టం లేక.. చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
This post was last modified on %s = human-readable time difference 1:38 pm
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…