రాజకీయాలంటేనే సెంటిమెంటుతో ముడిపడిన వ్యవహారం. పార్టీల నుంచి నాయకుల వరకు అందరూ సెంటిమెంటుతోనే ముందుకు సాగుతుంటారు. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ కనిపించింది. 2019లో ఏ సెంటిమెంటును అయితే ఆయన పాటించారో.. ఇప్పుడు కూడా అదే సెంటిమెంటును సీఎం జగన్‌రిపీట్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు తొలిసారి.. జగన్.. తన పార్టీ అభ్యర్థుల జాబితాను కడప జిల్లాలోని తన తండ్రి సమాధి వద్ద రిలీజ్ చేశారు.
అది కూడా విడతల వారీగా కాకుండా.. ఒకేసారి సీఎం జగన్ ఈ జాబితాలను విడుదల చేశారు. అసెంబ్లీకి సంబంధించిన 175 నియోజకవ ర్గాలకుఅభ్యర్థులను అప్పట్లో ఒకే సారి ప్రకటించారు. ఇక పార్లమెంటుకు సంబంధించి కూడా 25 మంది అభ్యర్థులను కూడా ఒకేసారి విడుదల చేశారు. ముందుగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రత్యేకంగాప్రార్థనలు చేసిన తర్వాత.. వైసీపీ అధినేత ఈ జాబితాలను విడుదల చేశారు.
ఇక్కడ కూడా మరో సూత్రం పాటించారు. జగన్ తన కుడి పక్కన బీసీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ను, ఎడమ పక్కన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్‌ను కూర్చోబెట్టుకుని వారితోనే జాబితాలను విడుదల చేయించారు. అసెంబ్లీ జాబితాను ధర్మాన విడుదల చేయగా, ఎంపీల జాబితాను నందిగం సురేష్ చదవి వినిపించారు. ఇక ఆప్పటి ఎన్నికల్లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకుంది.. పార్లమెంటుకు వచ్చేసరికి 22 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది.
కట్ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంటును సీఎం జగన్ ఫాలో అయ్యారు. తన కుడి పక్కన బీసీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ను, ఎడమ పక్కన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్‌ను కూర్చోబెట్టుకుని వారితోనే జాబితాలను విడుదల చేయించారు. అసెంబ్లీ జాబితాను ధర్మాన విడుదల చేయగా, ఎంపీల జాబితాను నందిగం సురేష్ చదవి వినిపించారు. యితే.. సీట్లలో మాత్రం బీసీలు, మైనారిటీ, ఎస్సీ, మహిళలకు సీట్లు పెంచారు. మరి ఈ సెంటిమెంటు ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.