కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడింది. మనం ఊహించినదానికంటే ఎక్కువగా ఇండియాలో కరోనా ఉంది. 30-40 రోజుల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఇపుడు బయటపడుతున్నాయి. దీనిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం కరోనా కర్నూలులో నాలుగో దశలో ఉంది. నాకు తెలిసి దేశంలో కరోనా సుమారు 2 కోట్ల మందికి సోకి ఉంటుంది అని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సమస్య ఎక్కువ కావడం లేదు, సమస్య ప్రపంచమంతటా ఉంది.
మన వద్ద కూడా ఉంది. ఒక్కో కేసు వచ్చిన కొద్దీ చుట్టుపక్కల అందరికీ టెస్టులు చేస్తున్నాం కాబట్టి బయటపడుతోంది అని ఆయన చెబుతున్నారు. మొత్తం 130 కోట్ల మందికీ టెస్టులు చేస్తే కనీసం 2-3 కోట్ల మందికి పాజిటివ్ ఉంటుందని చాలా సింపుల్ గా చెప్పేశారు ఎంపీ సంజీవ్.
తన ఇంట్లో 6 గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో నలుగురు డాక్టర్లు. సమాజానికి బ్యాక్ బోన్ వంటి వృత్తుల్లో ఒకటైన డాక్టర్లను కరోనా వచ్చిందని చెప్పి క్వారంటైన్లో పడేయడం, బ్లాక్ లిస్టులో పెట్టడం ఇదంతా మంచిది కాదని చాలా తేలికగా వ్యాఖ్యానించారు సంజీవ్ కుమార్. చిత్రమైన విషయం ఏంటంటే.. ఈయన స్వతహాగా డాక్టరు. అయినా విషయాన్ని చాలా తేలికగా చెప్పేస్తున్నారు.