Political News

వైసీపీలోకి ముద్రగడ, జనసేనకి అదే అడ్వాంటేజ్.!

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేతగా చెప్పబడే ముద్రగడ పద్మనాభం, ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు. భారీ జన సందోహం నడుమ, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ముద్రగడ ప్లాన్ చేసుకున్నా, కాపు సామాజిక వర్గం ఆయన్ని లైట్ తీసుకుంది. దాంతో, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది.

ముద్రగడకి వైసీపీ ఎలాంటి ‘ఆఫర్’ ఇచ్చింది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, చాలాకాలంగా ఆయన వైసీపీతోనే వున్నారు. ప్రత్యక్షంగా వైసీపీలో చేరకపోయినా, 2014 ఎన్నికల సమయం నుంచీ ఆయన వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారన్నది బహిరంగ రహస్యం.

అయితే, కాపు సామాజిక వర్గ ప్రముఖుడు కావడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాస్త ఆచి తూచి వ్యవహరించారు. ఓ దశలో జనసేనలోకి ముద్రగడ పద్మనాభంని ఆహ్వానించాలని కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అయితే, వైసీపీ కోవర్టుగా జనసేనలోకి ముద్రగడ వస్తే, జనసేన పార్టీకే నష్టమన్న కోణంలో పవన్ కళ్యాణ్ కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చింది.

జనసేనలో చేరి, కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాలనుకున్న ముద్రగడ పద్మనాభంకి, ఆ అవకాశం దొరక్కపోవడంతో, తనను ఇన్నాళ్ళూ వెనకుండి నడిపిస్తున్న వైసీపీలోకే వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు.

ఈ మొత్తం వ్యవహారంలో, జనసేన పార్టీ తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్నట్లయ్యింది. ముద్రగడ, వైసీపీలోకి చేరడం జనసేనకు లాభమే తప్ప, నష్టం లేదన్నది ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గంలో జరుగుతున్న చర్చ.

This post was last modified on March 16, 2024 11:21 am

Share

Recent Posts

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

34 minutes ago

వాహ్ విజయ్… తడబడతాడనుకుంటే నిలబడ్డాడు!

తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…

1 hour ago

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

3 hours ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

3 hours ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

4 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

4 hours ago