ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కొంత సమయం మాత్రమే ఉంది. కానీ, ఫలితం మాత్రం ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. మళ్లీ మేమేనని ఈ దేశం మొత్తం చాటి చెబుతోంది. ఈ దేశ ప్రజలు మోడీని మరోసారి ప్రధానిని చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ సయమంలో మరెంతో దూరంలో లేదు
అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడు తూ.. మరికొద్ది సేపట్లో ఎన్నికల షెడ్యూల్ రానుందని, అయితే ఇప్పటికే మరోసారి మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దేశ ప్రజలు నిర్ణయించేశారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, అప్పట్లోనూ తాను వచ్చానని తెలిపారు.
బీఆర్ ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తాను స్పష్టంగా చూశానని మోడీ అన్నారు. ఈసారి ఎన్డీయే కూటమికి 400 సీట్లు రాబోతున్నాయని తెలిపారు. అదే గాలి తెలంగాణలోనూ వీస్తోందని చెప్పారు. గత పదే ళ్ళలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని తెలిపారు. అయితే.. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజల కలలను ఈ రెండు పార్టీలు ధ్వంసం చేశాయని విమర్శంచారు.
మల్కాజిగిరిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్ షో అద్భుతంగా జరిగిందని, ప్రజల నుంచి విశేష స్పం దన లభించిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అబ్ కీబార్ 400 పార్ నినాదమే వినిపిస్తోందని చెప్పారు. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్‌గా అభివర్ణించారు. ఏడుదశాబ్దాల పాటు కాంగ్రెస్ ఈ దేశాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. అదే రీతిలో తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆస్తులను దోచుకుందని దుయ్యబట్టారు.
This post was last modified on March 16, 2024 2:14 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…