Political News

ఏయే రాష్ట్రాల్లో ఎవ‌రిది పైచేయి.. తాజా స‌ర్వే!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరు పార్టీలూ చ‌మ‌టోడుస్తున్నాయి. మూడోసారి కూడా అధికారంలోకి రావాల‌ని ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యించుకుని దూసుకుపో తున్నారు. క‌నీసం ఇప్పుడైనా గెల‌వ‌క‌పోతే.. పార్టీనే పుట్టిమునుగుతుంద‌న్న ఆందోళ‌న‌లో కాంగ్రెస్ అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్ విడుద‌ల కానుంది. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది? ఏ పార్టీకి వారు ప‌ట్టం క‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే విష‌యాల‌పై ఏబీపీ-సీ ఓట‌రు ప్రీపోల్ స‌ర్వే నిర్వ‌హించింది. దీనిలో ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిందంటే..

ఉత్తరప్రదేశ్: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌. ఇక్క‌డ ఏకంగా 80 లోక్‌స‌భ‌సీట్లు ఉన్నాయి. ఇక్క‌ ఎవరికి మెజార్టీ వస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే సెంటిమెంటు కూడా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెరుగైన ఫలితాలు వస్తాయని స‌ర్వేలో తేలింది. మొత్తం 80 లోక్ సభ సీట్ల‌లో ఎన్డీఏ కూటమి 74 ఖాయ‌మ‌ని ప్ర‌జ‌లు తేల్చి చెప్పిన‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ(ఎస్పీ) కూట‌మికి 6 ద‌క్క‌నున్నాయ‌ని పేర్కొంది.

హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత ఉత్త‌రాది రాష్ట్రం. ఇక్క‌డ‌ 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అయితే ఈ నాలుగు సీట్లలోనూ బీజేపీదే గెలుప‌ని స‌ర్వే తెలిపింది. ఇక్క‌డ 65 శాతం మంది ప్రజలు మోడీనే కోరుకుంటున్న‌ట్టు స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిని గుండుగుత్త‌గా బీజేపీ త‌న ఖాతాలో వేసుకునే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. కాంగ్రెస్ కూటమి మూడు స్థానాలు.. బీజేపీ కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయ స‌ర్వేలో తేలింది.

కేరళ: మొత్తం 20 పార్ల‌మెంటు సీట్లు ఉంటే.. అందులో 20 సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెల్చుకోనుందని స‌ర్వే తెలిపింది. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచే చాన్స్ ఉందని తెలిపింది.

రాజస్థాన్: 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లోనూ బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని స‌ర్వే పేర్కొంది.

గుజరాత్: ఇది ప్రధాని మోడీ సొంత రాష్ట్రం. గత రెండు సార్లు ప్రజలు మోడీకి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ఉన్న 26 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. మూడో సారి కూడా గుజరాత్ ప్రజలు సంపూర్ణంగా మోడీకే జై కొడుతున్న‌ట్టు స‌ర్వే వెల్ల‌డించింది. 26/26 బీజేపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయ‌ని పేర్కొంది.

తమిళనాడు: అధికార‌ డీఎంకే కూటమి తమిళనాడులోని 39 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని స‌ర్వే పేర్కొంది. ఈ సారి బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తోంది. డిపాజిట్లు కూడా క‌ష్ట‌మ‌ని స‌ర్వే పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 13, 2024 8:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాట్ టాపిక్ – గేమ్ ఛేంజర్ మొదటి రోజు ఓపెనింగ్

నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…

48 minutes ago

ఫ్యాక్షన్ నేతలకు ఈ టీడీపీ యువ నేత ఆదర్శం

రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…

49 minutes ago

ఆ ఘటన కలచివేసింది: బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…

1 hour ago

మరింత పెద్దదౌతున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…

1 hour ago

పవన్ ను ఉద్దేశించి మాట్లాడలేదన్న బీఆర్ నాయుడు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…

10 hours ago

నా గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారు: పవన్

2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…

11 hours ago