జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహం మార్చుకున్నారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది విశ్వసనీయవర్గాల నుండి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పవన్ రెండు స్ధానాల్లో మళ్ళీ పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే జరుగుతున్న ప్రచారం నిజమేనట. కాకపోతే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం కావట. తాజా వ్యూహం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు లోక్ సభ నియోజకవర్గంలో కూడా పోటీచేయాలని పవన్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఉభయగోదావరి జిల్లాల్లో అసెంబ్లీకి, ఉత్తరాంధ్ర నుండి ఎంపీగా పోటీచేయటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీకి పోటీచేయబోయే సీట్లని ఇప్పటికే చాలా నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో పవన్ పోటీచేయబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. మొదట్లో కాకినాడని, తర్వాత భీమవరం నియోజకవర్గాల్లోనే పవన్ పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ రెండింటిలో కూడా పవన్ పోటీచేయటంలేదని దాదాపు తేలిపోయింది. అందుకనే అందరి దృష్టి ఇపుడు పిఠాపురం మీద పడింది. పిఠాపురంలో పోటీచేయబోతున్నట్లు పవన్ చెప్పలేదు. అయితే రెగ్యులర్ గా పవన్ పేరుతో ఇక్కడ సర్వేలు జరుగుతున్నాయట.
సరే, ఈ విషయాన్ని వదిలేస్తే ఇక రెండో నియోజకవర్గంలో పోటీ అంటే అది పార్లమెంటు నియోజకవర్గమే అని ఇపుడు ప్రచారం ఊపందుకుంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి నుండి ఎంపీగా పోటీచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కారణం ఏమిటంటే మొన్నటివరకు పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లిలో ఎంపీగా పోటీచేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు నాగబాబు విత్ డ్రా అయిపోయారని అంటున్నారు. అనకాపల్లి అచ్యుతాపురంలో ఇల్లు తీసుకున్న నాగబాబు ఆ ఇంటిని ఖాళీ చేసేశారట. దాంతో నాగబాబు ఇక్కడ పోటీచేయటంలేదనే ప్రచారం పెరిగిపోయింది.
నాగబాబు ప్లేసులో పవన్ ఎంపీగా పోటీచేస్తారని అంటున్నారు. ఇదంతా బీజేపీ పెద్దల గేమ్ ప్లానులో భాగంగానే జరుగుతోందని కూడా ప్రచారం జరుగుతోంది. రేపటి ఎన్నికల తర్వాత పవన్ ఎంపిగా గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. అందుకనే పార్లమెంటు పోటీకి సేఫ్ సీటును వెతుక్కోమని ముందే చెప్పారట. ఇందులో భాగంగానే అనకాపల్లి పార్లమెంటు సీటును పవన్ రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 5, 2024 9:43 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…