తాజాగా ప్రకటించిన టీడీపీ తొలి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కనిపించలేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. పేరు..తాజా జాబితాలో లేకపోవడంతో ఆయనకు ఎక్కడ టికెట్ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఆయన విశాఖ పరిధిలోని భీమిలి లేదా పెందుర్తి నుంచి టికెట్ కావాలని కోరుతున్నారు. అయితే.. రెండు రోజుల నుంచి ఆయన పేరు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంపరిశీలనలో ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఇక, దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. వైసీపీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ఎవరు వచ్చి పోటీ చేసినా ఓడిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలువరించిన జాబితాలో ఎక్కడా గంటా పేరు కనిపించలేదు. పైగా ఆయన ఎదురు చూస్తున్న భీమిలి నుంచి జనసేనకు కేటాయించారు. ఈ పార్టీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ యాదవ్ పోటీ చేయనున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం చాలా కష్టం.
ఇక, గంటా ఆశించిన మరో నియోజకవర్గం పెందుర్తి. ఇక్కడ కూడా.. జనసేన పోటీ చేయనుంది. జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్‌బాబును ప్రకటించారు. పోనీ.. గాజువాక అయినా.. టీడీపీ తీసుకుని ఉంటే బాగుండేదనే వాదన ఉంది. కానీ, ఇక్కడ కూడా జనసేనకు ఇచ్చేశారు. ఈ పార్టీ తరఫున సుందరపు సతీష్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ఇలా.. గంటా శ్రీనివాసరావుకు దాదాపు విశాఖనగర పరిధిలో చోటు లేకపోవడం గమనార్హం. మరోవైపు.. విశాఖ ఉత్తరం కూడా మిగిలే పరిస్థితి లేదు. రేపు బీజేపీతో పొత్తు ఉంటే ఆ సీటును.. బీజేపీ అభ్యర్థి.. విష్ణుకుమార్‌రాజుకు కేటాయించాల్సి ఉంటుంది. మరి గంటా కు ఏ సీటు ఇస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates