బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీయార్ కు ఏమైందో అర్ధంకావటం లేదట. ఎందుకంటే నాలుగు రోజులుగా ఎవరితోను టచ్ లో లేరని పార్టీవర్గాలు చెప్పాయి. పార్టీలోని ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలు కేటీయార్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే అందుబాటులో లేరని ఫోన్లో సమాచారం వస్తోందట. పార్టీ ఆఫీసులోను లేక, ఇంట్లోను అందుబాటులోక, ఫోన్లోను కలవటం కుదరకనపోతే మరి కేటీయార్ ఎక్కడున్నారనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా కేటీయార్ యాక్టివ్ గా కనబడలేదు.
అసెంబ్లీ సమావేశాలంతా హరీష్ రావు భుజాల మీదే జరిగింది. ప్రధాన ప్రతిపక్షం తరపున అనేక అంశాలపై రేవంత్ రెండ్డి, మంత్రులను హరీష్ ఒక్కళ్ళే సమాధానాలు చెప్పాల్సొచ్చింది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. మరోవైపు అధికారపార్టీ నుండి ఆరోపణల మీద ఆరోపణలు, విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇంకోవైపు పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయాల్సిన అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు స్పీడు పెంచాలి. వారం రోజుల క్రితం నల్గొండ బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత కేసీయార్ ఇప్పటివరకు ఎవరితోను భేటీ కాలేదు.
ఇదంతా చూసిన తర్వాత బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందనే ప్రచారం పెరిగిపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో కేటీయార్ కూడా నాలుగురోజులుగా ఎవరితోను టచ్ లోకి రావటంలేదంటేనే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏదో పనిమీద అమెరికాకు వెళ్ళారనే ప్రచారం జరుగుతున్నా వాస్తవంలేదని పార్టీవర్గాలంటున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీలో ఇలాంటి నైరాశ్యాన్ని చాలామంది సీనియర్లు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో అయితే వేరీజ్ కేటీయార్ అనే ప్రశ్న ట్రెండింగ్ లో ఉందని పార్టీలో టాక్ నడుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కేటీయార్ కొన్ని సమావేశాలు నిర్వహించారు. నిజానికి వాటిని అప్పట్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలుగానే అభివర్ణించారు. అయితే ఆ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు కేసీయార్ ఒంటెత్తుపోకడలు, జనాల్లో తీవ్ర వ్యతిరేకత, సిట్టింగులకే మళ్ళీ టికెట్లు ఇవ్వటం లాంటి కారణాలుగా చాలామంది నేతలు మొహంమీదే చెప్పారు. దాంతో ఏమనుకున్నారో ఏమో సడెన్ గా సన్నాహక సమావేశాలను నిలిపేశారు. మళ్ళీ అప్పటినుండి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు జరగలేదు. ఈ నేపధ్యంలోనే కేటీయార్ నాలుగు రోజులుగా టచ్ లో లేరన్న విషయం ఆసక్తిగా మారింది.
This post was last modified on February 24, 2024 10:52 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…