Movie News

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఆయన పక్కనే ఉన్న హీరో శ్రీలీల సడన్‌గా వెనక్కి తిరిగి చూసింది. తన వెనుకే ఉన్న జబర్దస్త్ కమెడియన్, ‘రంగస్థలం’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించిన మహేష్ నవ్వాడు. కానీ శ్రీలీల నవ్వలేదు. సీరియస్ లుక్ ఇచ్చింది.

దీంతో మహేష్ ఏదో చేసి ఉంటాడంటూ అతన్ని ట్రోల్ చేశారు నెటిజన్లు. అదే సమయంలో అతడి పట్ల శ్రీలీల అమర్యాదకరంగా వ్యవహరించిందంటూ కొందరు కామెంట్లు చేశారు. దీనిపై ఇప్పటికే మహేష్ క్లారిటీ ఇచ్చాడు. అంతకుముందు శ్రీలీల తన ఫోన్ పట్టుకోమని తనకిచ్చిందని.. ఆమె వెనక్కి తిరిగి తన వైపు చూసేసరికి ఫోన్ కోసం చూస్తోందని అనుకున్నానని.. ఈ లోపు శ్రీలీల స్క్రీన్ వైపు పైకి చూసిందని అంటూ అంతకుమించి ఏమీ జరగలేదని స్పష్టం చేశాడు మహేష్.

ఇప్పుడీ వివాదం గురించి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో శ్రీలీల కూడా స్పందించింది. ఆ రోజు అసలే వివాదం లేదని.. ఎవ్వరూ ఏమీ మాట్లాడని వీడియో చూసి ఏదేదో ఊహించుకుంటున్నారని ఆమె స్పష్టం చేసింది. మహేష్‌తో సినిమాలో తనకు కాంబినేషన్ సీన్లు చాలా ఉన్నాయని, తనతో మంచి స్నేహం ఉందని ఆమె చెప్పింది.

స్టేజ్ మీదికి వెళ్లేటపుడు మహేష్ తనకు సాయం చేశాడని, తన ఫోన్ అతడికి ఇచ్చానని ఆమె వెల్లడించింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నపుడు ఏదో సౌండ్ రావడంతో అది తన మొబైల్ సౌండేమో అని తాను వెనక్కి తిరిగి చూశానని.. తాను ఫోన్ అడుగుతున్నానేమో అనుకుని మహేష్ తన వైపు చూశాడని.. అందరి దృష్టీ పవన్ స్పీచ్ మీద ఉండడంతో అంతకుమించి ఎక్కువ ఏమీ ఆలోచించలేదని శ్రీలీల చెప్పింది.

కానీ మాటలు లేని ఈ వీడియో చూసి జనాలు రకరకాల ఊహాగానాలు సృష్టిస్తున్నారని.. తన దృష్టికి కూడా ఈ వీడియో వచ్చిందని ఆమె చెప్పారు. సెలబ్రెటీల గురించి ఇలా ఏదేదో మాట్లాడేస్తుంటారని.. కానీ తమ నోటి నుంచి ఏదైనా చెప్పే వరకు దేని మీదా ఒక అంచనాకు రావద్దని ఆమె స్పష్టం చేశారు. శ్రీలీల ఇలా స్పందించడంతో ఆ వివాదానికి ఇంతటితో తెరపడినట్లయింది.

This post was last modified on March 18, 2026 11:43 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

2 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

3 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

5 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

5 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

5 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

5 hours ago