Political News

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. ‘అన్న‌’ అనే ప‌దానికి జ‌గ‌న్ కళంక‌మ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త‌న బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో తాజాగా క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. అస‌లు.. వివేకా హ‌త్య జ‌రిగిందే ఎంపీ సీటు కోస‌మ‌ని తెలిపారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎంపీ సీటును అవినాష్‌కు ఇవ్వ‌డాన్ని వివేకా అడ్డుకున్నార‌ని.. అవినాష్ లాంటి వారికి ఈ సీటు ఇవ్వ‌ద్ద‌ని చెప్పార‌ని అన్నారు.

అయితే.. జ‌గ‌న్ వివేకా మాట విన‌కుండా అవినాష్‌రెడ్డికే ఈ సీటును ఇచ్చార‌న్న ష‌ర్మిల‌.. ఇక‌, తన‌కు ఎంపీ సీటు ఇవ్వ‌ద్ద‌న్న వివేకాపై అవినాష్ క‌క్ష పెంచుకున్నార‌ని తెలిపారు. వివేకా బ‌తికి ఉంటే ఎప్ప‌టికైనా త‌న‌కు రాజ‌కీయంగా అడ్డేన‌ని అవినాష్‌ భావించిన‌ట్టు చెప్పారు. ఇక‌, వివేకా గుండె పోటు క‌థంతా జ‌గ‌న్ సొంత మీడియా సృష్టేన‌ని ష‌ర్మిల ఆరోపించారు. కానీ.. ఇప్పుడు ఇదంతా సునీతే చేయించార‌ని అవినాష్ రెడ్డి చెబుతుండ‌డం దారుణ‌మని త‌ప్పుబ‌ట్టారు. చివ‌ర‌కు సొంత తండ్రిని సునీతే చంపుకున్నార‌న్న విధంగా అవినాషే చిత్రీక‌రించార‌ని ఆరోపించారు.

“ఎంపీ సీటుకు అవినాష్ స‌రికాద‌మ్మా.. అని వివేకా నాకు స్వ‌యంగా చెప్పారు.” అని ష‌ర్మిల తెలిపారు. ఈ కేసులో మొద‌ట్లో సీబీఐ విచార‌ణ కోరింది జ‌గ‌నేన‌ని తెలిపారు. కానీ, ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీబీఐని కాద‌ని సొంత పోలీసుల‌ను నియ‌మించుకున్నార‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో సునీత ఎన్నిసార్లు బ్ర‌తిమాలినా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌న్న విన్న‌పాన్ని కూడా వ‌దిలేశార‌న్నారు. ప్ర‌స్తుతం కోర్టు ఆదేశాల‌తోనే సీబీఐ విచార‌ణ జ‌రిగింద‌ని ష‌ర్మిల చెప్పారు.

అవినాష్ చెప్పిన‌ట్టుగా వివేకాకు శ‌త్రువులు ఎవ‌రూ లేర‌ని ష‌ర్మిల తెలిపారు. ఒక వేళ శ‌త్రువులే ఉండి ఉంటే.. ఐదేళ్ల వైసీపీ పాల‌నలో ఎందుకు ప‌ట్టుకోలేక పోయార‌ని ఆమె ప్ర‌శ్నించారు. క‌నీసం ఈ హ‌త్య కేసును విచారించి ఒక కొలిక్కి తీసుకురావాల‌న్న స్పృహ కూడా జ‌గ‌న్‌కు లేకుండా పోయింద‌ని.. చెల్లెలు అడిగింద‌న్న క‌నీస జాలి ద‌య కూడా చూపించ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. “శ‌త్రువులు ఇంత‌క‌న్నా ఎవ‌రూ ఉండ‌రు. ఇలాంటి ‘అన్న‌’ ఉంటే శ‌త్రువులు అవ‌స‌రం లేదు.” అని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా.. ఈ కేసు కొలిక్కి రావాల‌ని.. హంత‌కులు జైలుకు వెళ్లాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

This post was last modified on March 18, 2026 6:15 pm

Share

Recent Posts

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ…

2 hours ago

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…

2 hours ago

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

7 hours ago

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

9 hours ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

10 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

11 hours ago