వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఆ దిశగా జనసేనతో ఇప్పటికే పొత్తు పెట్టుకుంది. రాబోయే రోజుల్లో బీజేపీతోనూ చేతులు కలపాలని నిర్ణయానికి వచ్చింది. అయితే.. ఈ పొత్తులే.. పార్టీకి విచ్చుకత్తులుగా మారుతున్నాయి. చాలా చోట్ల నాయకులు.. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమకు టికెట్ లేకుండా చేస్తారా? అంటూ.. వారి వారి మార్గాల్లో అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. ఉమ్మడి కృష్నాజిల్లాలోని నూజివీడులో అబ్యర్థిని మార్చడం.. పెనమలూరులో షఫిలింగ్ సహా.. కొన్నిచోట్ల జనసేనకు ఇవ్వడం టీడీపీలో కలకలం రేపుతోంది.
ఈ క్రమంలో తాజాగా విజయవాడ టీడీపీలో మరో వివాదం తెరమీదకి వచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తున్న మైనారిటీ నాయకుడు జలీల్‌ఖాన్.. ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చి తీరాలని ఆయన కోరుతున్నారు. అయితే.. ఈ సీటును జనసేన కూడా పట్టుబడుతోంది. వాస్తవానికి ఇలాంటి మరో నాలుగు ఉన్నాయి. కానీ, పశ్చిమలో మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో జలీల్ ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు.
కానీ, పార్టీ అధిష్టానం.. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. జనసేన యువ నాయకుడు పోతుల మహేష్.. ఇక్కడ నుంచిపోటీ చేసేందుకు రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన ఖాన్.. సామ, దాన, భేద, దండోపాయలను తెరమీదికి తెచ్చారు. కొన్నాళ్ల కిందట మైనారిటీ వర్గం పార్టీకి దూరమవుతుందని.. తనకు టికెట్ ఇవ్వాలని అన్నారు. దీనికి స్పందన రాలేదు. తర్వాత.. తనను ఢీకొట్టే నాయకుడు లేరన్నారు. అయినా.. ఎవరూ పట్టించుకోలేదు.
ఇక, తాజాగా జలీల్‌ఖాన్.. వైసీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, ఈ విషయం వెలుగు చూడగానే.. టీడీపీ అలెర్ట్ అయిపోయింది. వెంటనే.. విజయవాడ పార్లమెంటరీ పార్టీ నేత కేశినేని చిన్నిని ఖాన్ దగ్గరకు పంపించింది. బుధవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే సుదీర్ఘ చర్చలు సాగాయి. చంద్రబాబు అప్పాయింట్‌మెంట్ ఇప్పిస్తానని చిన్ని ఇచ్చిన హామీతో జలీల్ వెనక్కి తగ్గారు. ఏదేమైనా.. ఈ ఘటన పార్టీలో చర్చనీయాంశం అయింది. రేపు ఇలాంటివి ఇంకెన్ని తెరమీదికివస్తాయోనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on February 22, 2024 12:19 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…