Movie News

‘స్టార్లను’ మార్చేసిన బన్నీ

కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా స్టార్ ఇమేజ్ ఉన్నపుడు ఒక ట్యాగ్ పెట్టుకుని.. రేంజ్ పెరిగాక అది ఆనలేదని ఇంకా పెద్ద ట్యాగ్ లైన్ పేరు ముందుకు తీసుకురావడమూ ఇండస్ట్రీలో కామనే.

కెరీర్ ఆరంభంలో స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ తర్వాత ఐకాన్ స్టార్ అయ్యాడు. మహేష్ బాబుకు సైతం మొదట్లో ‘ప్రిన్స్’ అనే ట్యాగ్ లైన్ ఉండేది. కానీ పెద్ద స్టార్ అయ్యాక తండ్రి నుంచి వారసత్వంగా ‘సూపర్ స్టార్’ వచ్చేసింది. ఐతే హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్సులో ఈ ఇద్దరు హీరోలతో పాటు పలువురు స్టార్ల పేర్ల వెనుక పాత ట్యాగ్ లైన్‌లే ఉంచేశారు.

స్వయంగా బన్నీ.. తన పేరు ముందు ‘స్టైలిష్ స్టార్’ అని పెట్టుకున్నాడు. మహేష్ పేరు ముందూ ‘ప్రిన్స్’ అని ఉంచేశారు. ప్రభాస్‌ను ఇప్పుడు అందరూ అతడి పెదనాన్న కృష్ణంరాజు బిరుదైన ‘రెబల్ స్టార్’ అని పిలుస్తున్నారు. కానీ అల్లు సినిమాస్‌లో మాత్రం ‘డార్లింగ్’ అంటూ పాత ట్యాగ్ లైన్ వాడారు.

రామ్ చరణ్‌ను అభిమానులు మెగా పవర్ స్టార్ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. కానీ అల్లు సినిమాస్‌లో మాత్రం తన ముద్దు పేరు ‘చెర్రీ’ని వాడారు. కమల్ హాసన్‌కు లోకనాయకుడు/ఉలగనాయగన్ అని పేరుండగా.. పెద్దగా పాపులర్ కాని ‘కాలై జ్ఞాని’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌ పూర్తి పేరును కాకుండా ‘తారక్’ అనే షార్ట్ నేమ్‌తో సంబోధిస్తూ, తన పేరు వెనుక ‘టైగర్’ అని పెట్టారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ‘కింగ్ ఖాన్’ ట్యాగ్ లైన్ ఇవ్వడం విశేషం. షారుఖ్ ఖాన్‌‌ను ‘భాయిజాన్’ అన్నారు. సూపర్ స్టార్ బిరుదును రజినీకాంత్‌తో పాటు శివరాజ్‌కుమార్‌కూ వాడారు. చిరును మెగాస్టార్ అని, పవన్ ను పవర్ స్టార్ అని, నాగ్‌ను కింగ్ అని, వెంకీకి విక్టరీ అని వాడి.. బాలకృష్ణ పేరు పక్కన ‘జై బాలయ్య’ అని నినాదాన్ని జోడించారు.

This post was last modified on March 14, 2026 6:51 am

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

43 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago