ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా దేశ ప్రజలకు కీలక సూచన చేసింది. బొగ్గులు, కిరోసిన్ పొయ్యిలను పెట్టుకోవాలని పేర్కొంది. దేశంలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణచర్యలుగా ఈ నిర్ణయం తీసకున్నామని పెట్రోలియం శాఖ పేర్కొనడం గమనార్హం. ఒక్క వంటిళ్లకు మాత్రమే కాదు.. వాణిజ్య, హోటళ్లు, రెస్టారెంట్లు సహా.. అన్ని వ్యాపార సంస్థలకు కూడా ఈ సూచనలు చేసింది. కిరోసిన్, బొగ్గులు, పిడకలు, సహా.. ఇతర సంప్రదాయ వనరులైన.. కట్టెల పొయ్యిలను కూడా వాడుకోవాలని పేర్కొంది.
రాష్ట్రాలకు ఆదేశం..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా.. తమ ప్రజలను సంప్రదాయ ఇంధన వనరులైన బొగ్గులు, కిరోసిన్, పిడకలు, కట్టెల పొయ్యి లకు మళ్లేలాచర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. అంతేకాదు.. రాష్ట్రాలకు కేటాయిస్తున్న కిరోసిన్‌ను 48 వేల కిలో లీటర్లు అదనంగా కేటాయించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం లక్ష కిలో లీటర్లు కేటాయిస్తున్నారు. అయితే.. గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యం లో ఈ కేటాయింపును మరో 48 వేల కిలో లీటర్లకు పెంచుతున్నామని తెలిపింది. జనాభా ఆధారంగా ఈ పెంపు, కేటాయింపులు ఉంటాయని పేర్కొంది. మరోవైపు.. గ్యాస్ కొరత రాకుండా.. 30 శాతం మేరకు ఉత్పత్తులు పెంచామని వెల్లడించింది.
బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం!
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని తెలిపింది. ఉక్కుపాదం మోపాలని రాష్ట్రాలను ఆదేశించింది. అదేసమయంలో వినియోగదారులకు ఎక్కడా లోటు రాకుండా చూడాలని కోరింది.
అంతేకాదు.. రేషన్ దుకాణాల్లో కిరోసిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని.. ప్రతికుటుంబానికీ..(దుకాణాలకు వచ్చేవారికి) 5 లీటర్ల చొప్పున తక్షణం ఇవ్వాలని సూచించింది. ఇక, వాణిజ్య హోటళ్లు, రెస్టారెంట్లలోనూ గాడి పొయ్యిలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఇదేసమయంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో సంస్థలు చేసే దాడులను నిలువరించాలని.. కేంద్రం పేర్కొంది. పర్యావరణ సంస్థలు నెల రోజుల పాటు.. ఈ విషయంపై మౌనం పాటించాలని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి బయట పడే వరకు ఎలాంటిదాడులు చేయొద్దని పేర్కొంది. ప్రజలకు ఆహారం అందించడంతోపాటు.. వారు జీవించేలా చేయడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యంగా పేర్కొంది. ఇదేసమయంలో గ్యాస్ కొరత సహా.. బొగ్గు, కిరోసిన్ వినియోగంపై విమర్శలు చేసేవారిని ఉపేక్షించవద్దని కూడా రాష్ట్రాలను ఆదేశించడం గమనార్హం.
This post was last modified on March 13, 2026 11:41 pm
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…