తెలంగాణా బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు సర్వేల్లో బీజేపీ గెలుచుకోబోయే ఎంపీల సంఖ్య ఇది అని వెల్లడవుతున్న జోస్యాలు. మరోవైపు కచ్చితంగా డబుల్ డిజిట్ టచ్ చేయాల్సిందే అన్న అగ్రనేతల ఆదేశాలు. ఈ రెండింటి మధ్యలో సమన్వయం సాధించటం ఎలాగ అన్న టెన్షన్ సీనియర్ నేతల్లో పెరిగిపోతోందని పార్టీవర్గాల సమాచారం. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో ఎట్టి పరిస్ధితుల్లోను 10 సీట్లు గెలుచుకుపోవాల్సిందే అని ఇప్పటికే జాతీయ నాయకత్వం స్పష్టంగా చెప్పింది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరబాట్లు రిపీట్ కాకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదేపదే తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు సీనియర్లందరికి చాలాసార్లు చెప్పారు. అభ్యర్ధుల ఎంపికలో అన్నీ జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. అగ్రనేతల సూచనలు, ఆదేశాలు ఎలాగున్నా రాబోయే ఎన్నికలపై రిలీజ్ అవుతున్న సర్వే జోస్యాలు టెన్షన్ పెంచేస్తున్నాయి. ఏ సర్వేని తీసుకున్నా బీజేపీకి మూడుసీట్లకన్నా ఎక్కువ రావని స్పష్టంగా చెప్పేస్తున్నది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సర్వేల్లో బీజేపీకి మూడు లేదా నాలుగు సీట్లకు మించి రావని కొన్ని సర్వేలు చెప్పాయి. మరికొన్ని సర్వేలేమో సింగిల్ డిజిట్ దాటదని చెప్పాయి. సర్వేల్లో చెప్పినట్లుగా సింగిల్ డిజిట్ దాటలేదు. అయితే ఎన్నికలకు ముందు బీజేపీ బలం మూడు ఎంఎల్ఏలు మాత్రమే అయితే ఎన్నికల్లో ఆ బలం 8కి పెరిగింది. అంటే ఐదుసీట్లను అదనంగా గెలుచుకుకుంది. పెరిగిన ఐదుసీట్లే బీజేపీకి అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి.
ప్రస్తుత విషయానికి వస్తే బీజేపీకి నాలుగు ఎంపీలున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి పరిపాలనకు జనాలు సానుకులంగా స్పందిస్తున్నారు. దీనివల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. 17 సీట్లలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలకు చెరో మూడుసీట్లు, ఎంఐఎంకు ఒక్కసీటు దక్కుతుందంటున్నాయి సర్వేలు. రేవంత్ దూకుడుచూస్తుంటే ఎన్నికల్లో పదిసీట్లకు మించి సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్, బీజేపీ రెండు నష్టపోతాయి. అందుకనే బీజేపీలో సర్వేల టెన్షన్ పెరిగిపోతోందట.
This post was last modified on %s = human-readable time difference 10:15 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…