ష‌ర్మిల‌కు కొండంత అండ‌.. ప్ర‌చారానికి రెడీ!

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా చ‌క్రం తిప్పుతున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిల దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త ప‌దేళ్లు నిద్రాణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప‌రుగులు పెట్టిస్తానంటూ.. ఆమె చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆమెజిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల యాత్ర‌ను ప్రారంభిం చారు. ఇక‌, పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, శ్రేణుల‌తో ఆమె నియోజ‌వ‌ర్గాల వారిగా.. జిల్లాల వారిగా చ‌ర్చలు జ‌రుపుతున్నారు. వైసీపీస‌ర్కారు స‌హా సొంత అన్న‌పై ఆమె విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తీవ్ర‌స్థాయిలో ష‌ర్మిల‌.. సంధిస్తున్న విమ‌ర్శ‌లు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌గా మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత దూకుడుగా.. ఇంత షార్ప్‌గా విమ‌ర్శ‌లు సంధించ‌లేద‌ని అంటున్నారు. మొత్తంగా ష‌ర్మిల దూకుడు పెరిగింది అయితే.. ఆమెకు అండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ త‌ర‌ఫున గ‌ళం వినిపించేందుకు బ‌లంగా ఎవ‌రూ ముందుకు రాలేదు. మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి వంటి కొంద‌రు కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ. వారు వేరే పార్టీల్లో ఉన్నారు. దీంతో మ‌హిళా నాయకురాలిగా ష‌ర్మిల ఒంట‌రిపోరు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా తెలంగాణ‌కు చెందిన మంత్రి, వైఎస్ కుటుంబంతో స‌న్నిహితంగా మెలిగిన కొండా సురేఖ‌.. జ‌త‌క‌ల‌వ‌నున్నారు. ష‌ర్మిల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని.. కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తాన‌ని సురేఖ వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే తాను ఏపీకి వెళ్తాన‌ని.. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావాల్సి ఉంద‌ని ఆమె చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమె వైఎస్‌తో త‌న‌కు ఉన్న అనుబంధం.. రాజ‌కీయంగా ఆయ‌న ఆశీర్వాదంతోనే ఇలా ఉన్న‌త‌స్తాయిలో ఉన్నాన‌ని చెప్పారు.

ఇదిలావుంటే.. సీఎం జ‌గ‌న్‌కు మ‌రింత సెగ‌ పెర‌గ‌నుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వైసీపీ కోసం ఉమ్మ‌డి రాష్ట్రంలో స్పందించిన తొలి మ‌హిళా నాయ‌కురాలు.. కొండా సురేఖ‌. అంతేకాదు.. అప్ప‌ట్లో రోశ‌య్య గ‌వ‌ర్న‌మెంటులో ఆమె మంత్రి. అయితే.. జ‌గ‌న్ పార్టీ కోసం ఆమె ఆ ప‌ద‌వికి రాజీనామా చేసి వ‌చ్చారు. త‌ర్వాత‌.. వైసీపీలో అవ‌మానాలు ఎదురయ్యాయ‌ని పేర్కొంటూ ఆమె భ‌ర్త ముర‌ళీ.. సురేఖ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో గ‌తాన్నిత‌వ్వి.. జ‌గ‌న్‌పై దాడి చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.