వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని రెండోసారి కూడా అధికారంలోకి రావాలని బావిస్తున్న వైసీపీలో అంతర్గత విభేదాలు.. ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్సీ ఓటు బ్యాంకు తమకే అనుకూలంగా ఉందని చెబుతున్న వైసీపీలో ఆ ఎస్సీ నేతలే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో తమకు అవమానాలు తప్పడం లేదని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేసిన వారు కూడా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు.
“దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. వారికి అవమానాలు తప్పడం లేదు.” అని వైసీపీ ఎస్సీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పార్టీలో దళితులపై అవమానాలు సహజమైపోయాయంటూ మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. పార్టీలో ఎస్సీలకు వాల్యూ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓలేఖను పార్టీకి ఆయన పంపించారు.
ఏం జరిగింది?
మడకశిర నియోజకవర్గంలో ఇటీవల ఎమ్మెల్యే తిప్పేస్వామిని పక్కన పెట్టి.. వేరే వారికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఒంటెత్తు పోకడలు పోతున్నారనేది తిప్పేస్వామి ఆవేదన. మరో రెండు నెలల పాటు తాను ఎమ్మెల్యేగా ఉంటానని.. అయినప్పటికీ.. తనకు కనీస మర్యాద, ప్రొటోకాల్ ప్రకారం గౌరవం కూడా ఇవ్వడం లేదని తిప్పేస్వామి అంటున్నారు. తాజాగా నియోజకవర్గంలో స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అయిన తిప్పేస్వామిని పిలవలేదు. పిలిచినా.. చివరి నిముషంలో సమాచారం ఇచ్చారు.
దీనిపై తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నియోజకవర్గ ఇంచార్జ్ అశోక్ కుమార్‌కు లేఖ రాశారు. దురు ద్దేశంతోనే సమావేశానికి తాను రాకుండా చేశారని, ఎస్సీనైనన్ను పట్టించుకోకపోవడం మనసును గాయపరిచిందని పేర్కొన్నారు. దళిత వర్గానికి ఎలాంటి సందేశాన్ని పంపించాలని అనుకున్నారో చెప్పండని ప్రశ్నించారు. ఇది దళితులని అవమానించడం కాదా..! ఎన్నికల సమయంలో ఇది పార్టీకి నష్టం కలిగించదా
అని తిప్పేస్వామి నిలదీశౄరు. దళితలైన మేము ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానం భరించడం సహజమే అని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 28, 2024 3:13 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట…
ఆంధ్రుల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. 2014లో…
కారణాలు లేవని పేర్కొంటూనే.. రాజకీయాల నుంచి తప్పుకొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్. వైసీపీకి ఆయన గుడ్ బై…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలంలో కొన్ని రోజుల కిందట వెలుగు చూసిన డెడ్ బాడీ డోర్ డెలివరీ…
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…