Political News

రాజ‌కీయాల్లో ఉంటూ మౌనం పాటించ‌లేను: గ‌ల్లా గుడ్ బై

టీడీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు. తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన పార్టీ కేడ‌ర్ ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని.. త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాలు, వ్యాపారం రెండూ తాను కొన‌సాగించ‌లేక పోతున్న‌ట్టు చెప్పారు. రాజ‌కీయాల్లో నిజాయితీగా ఉంటే.. నోరు మూసుకుని మౌనంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు అయితే..తాను మౌనంగా చూస్తూ కూర్చోలేన‌ని చెప్పారు.

దీంతో త‌న వ్యాపారాల‌ను టార్గెట్ చేస్తున్న ప‌రిస్థితి వ‌స్తోంద‌ని, అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని, వ‌చ్చాయ‌ని ఆయ‌న చెప్పారు. పైగా వ్యాపారాల‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్ట‌లేక పోతున్న‌ట్టు గ‌ల్లా వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలోనే త‌న రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. “గుంటూరు ప్ర‌జ‌లు న‌న్ను ఆద‌రించారు. ఇక్క‌డ నుంచి మ‌రోసారి కూడా గెలిపించేందుకు వారు సిద్దంగానే ఉన్నారు. కానీ, నేను రాజ‌కీయాల్లో ఉంటే.. వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయి. అందుకే త‌ప్పుకొంటున్నా” అని గ‌ల్లా వ్యాఖ్యానించారు.

ప్రస్తుత రాజకీయాల పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన గ‌ల్లా.. ప్ర‌భుత్వంపై పోరాడితే.. వ్య‌క్తిగ‌తంగా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో తెగువ ప్ర‌ద‌ర్శించిన‌ట్టు చెప్పారు. ఇటు రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటూనే అటు పార్ల‌మెంటులోనూ నిల‌దీశాన‌ని, త‌ర్వాత‌.. ఇది త‌న వ్యాపారాల‌పై ఎఫెక్ట్ చూపించింద‌ని అన్నారు. పార్లమెంట్ లో 24% వ్యాపారవేత్తలు ఉన్నారని, వారంతా కూడా.. మౌనంగా ఉంటార‌ని.. కానీ, తాను మాత్రం మౌనంగా ఉండ‌లేన‌ని గ‌ల్లా వ్యాఖ్యానించారు.

నిజాయితీ ప‌రులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచి పార్లమెంట్ లో సైలెంట్ గా కూర్చోవడం త‌న‌ వల్ల కాదన్నారు. “2024 ఎన్నికల్లో పోటీ చేయను. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ గా ఉండలేను కాబట్టి వ్యాపారులు చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతాను. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా తిరిగి రాజకీయాల్లోకి వస్తాను.” అని గ‌ల్లా అన్నారు.

బిజినెస్ పార్ట్ టైమ్ గా చెయ్యొచ్చు కానీ.. రాజకీయాలు అలా చేయ‌లేమ‌ని, ఫుల్‌టైమ్ దానికి ఇవ్వాల్సిందే న‌ని గ‌ల్లా అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో తాను ఫుల్ టైం దానికి కేటాయించ‌లేన‌న్నారు. వ్యాపారం అయినా, రాజకీయాలు అయినా దేశం కోసం మాత్రమే చేస్తానని చెప్పారు. వ‌చ్చే ఎన్నికల్లో త‌మ కుటుంబం పూర్తిగా రాజ‌కీయాలకు దూరంగా ఉంటుంద‌ని చెప్పారు.

This post was last modified on January 28, 2024 2:37 pm

Share

Recent Posts

ద‌స‌రా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయినా.. ద‌ర్శ‌కుడి సారీ

ఒక సినిమా పెద్ద హిట్ట‌యితే.. అందులో లోపాలున్నా స‌రే, స‌క్సెస్‌లో కొట్టుకుపోతాయి. టీంలో ఎవ్వ‌రూ వాటి గురించి మాట్లాడ‌రు. సంబ‌రాల్లో…

28 minutes ago

సాయిరెడ్డి చెబుతున్నారు కానీ.. వ‌ర్క‌వుట్ అవుతుందా?

యువ‌తను ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని, రెడ్లేత‌ర సామాజిక వ‌ర్గానికి సీఎం సీటు అప్ప‌గిస్తామ‌ని చెబుతున్నా..మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఒక‌ప్పటి వైసీపీ నాయ‌కుడు…

29 minutes ago

ఆమిర్ గొప్పదనమేంటో చెప్పిన సిద్దార్థ్

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్‌కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అనే బిరుదు ఊరికే రాలేదు. హీరో అంటే సెట్లోకి…

1 hour ago

మంత్రి లోకేష్ వ్యాఖ్య‌లు.. విజ్ఞ‌ప్తా.. ఆదేశ‌మా?!

ఏపీ మంత్రి నారా లోకేష్.. తాజాగా సోష‌ల్ మీడియాలో చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయం దుమారానికి దారి తీశాయి. ఈ వ్య‌వ‌హారంపై…

2 hours ago

విజయ్ రాజకీయంపై నాని కామెంట్

ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రాజకీయ నాయకుడు అంటే.. విజయే. తమిళనాట నంబర్ వన్ హీరోగా ఎదిగిన ఆయన..…

3 hours ago

99 వేల కోట్లు..రేవంత్ కు కేటీఆర్ ఆఫర్

మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.…

3 hours ago