నాలుగో జాబితా విడుదల చేసిన వైసీపీ

jagan

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్చార్జిలను మూడు విడతలుగా వైసీపీ ప్రకటించింది. సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. అయినా సరే వెనక్కి తగ్గని జగన్ తాజాగా ఇన్చార్జిల మార్పునకు సంబంధించి నాలుగో జాబితాను రెడీ చేశారు.

ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు విడుదల చేశారు. నాలుగో జాబితాలో 9 నియోజకవర్గాల ఇన్చార్జిలను మారుస్తున్నట్లు బొత్స వెల్లడించారు. చిత్తూరు లోక్ సభ స్థానం ఇన్చార్జిగా నారాయణస్వామిని నియమించారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. ఇప్పటికే 50 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 9 పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలను మూడు విడతలలో వైసిపి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి, ఈ నాలుగో జాబితా తర్వాత ఎంతమంది నేతలు వైసీపీని వీడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం గుంటూరులో బాలశౌరి నివాసం ముందు ఆయన అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశమైంది. మచిలీపట్నం ఎంపీగా జనసేన తరఫున బాలశౌరి బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.

వైసీపీ ఇన్చార్జిల నాలుగో జాబితా ఇదే…

చిత్తూరు లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జ్ గా(ఎంపీ) నారాయణస్వామి
జీడీ నెల్లూరు ఇన్ ఛార్జ్ గా- రెడ్డప్పా
శింగనమల- ఎం వీరాంజనేయులు
తిరువూరు- స్వామిదాస్
మడకశిర -ఈర లక్కప్ప
కొవ్వూరు – తలారి వెంకట్రావ్
కనిగిరి – దద్దాళ నారాయణ యాదవ్
గోపాలపురం – తానేటి వనిత
నందికొట్కూరు – డా. సుధీర్ దారా