బీఆర్ఎస్ అంత పని చేసిందా.. !

కేసీయార్ పదేళ్ల పాలనలో జరిగిన అరాచకం మరోటి బయటపడినట్లు తెలుస్తోంది. అదేమిటంటే రిటైర్ అయిన ఉద్యోగులను రీ అపాయిట్మెంట్ చేయించి మళ్ళీ  అదే పోస్టుల్లో కొనసాగించటం.  వివిధ శాఖల్లోని ఇలాంటి రీ అపాయిట్మెంట్లు ఇపుడు బయటపడ్డాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. రిటైర్ అయిన ఉద్యోగులు సంబంధిత శాఖల వ్యవహారాల్లో  బాగా నిపుణులైతే వాళ్ళని సలహాదారులుగా తీసుకోవటం ఒక పద్ధతి. అయితే రిటైర్ అయినా సరే మళ్ళీ వాళ్ళనే రీ అపాయింట్ చేసి అదికారాలన్నీ వాళ్ళచేతుల్లోనే పెట్టడం అన్నది ఉండదు.

కానీ కేసీయార్ పదేళ్ళల్లో చాలామందిని ఇదే విధంగా రీ అపాయింట్ చేసినట్లు ఇపుడు వెలుగులోకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఐదుగురు ఐఏఎస్ అధికారులు అదర్ సిన్హా, రాణి కుముదిని, ఉమర్ జలీల్, అర్వీందర్ సింగ్, అనిల్ రిటైర్ అయిపోయారు. అయితే తమకున్న పలుకుబడితో వీళ్ళంతా తాము  ఏ శాఖల్లో రిటైర్ అయ్యారో అదే శాఖల్లో రీ అపాయిట్మెంట్ తెచ్చుకుని అదే హోదాలో కంటిన్యూ అవుతున్నారు. ప్రిన్సిపుల్ సెక్రటరీగా రిటైర్ అయిన ఐఏఎస్ అధికారులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలంటే సలహాదారుగా తీసుకుంటారు.

అంతేకానీ రిటైర్ అయిన ప్రిన్సిపుల్ సెక్రటరీ పోస్టునే రీ పోస్టింగ్ పేరుతో  ప్రభుత్వం ఇచ్చేందుకు లేదు. కానీ కేసీయార్ ఐదుగురు ఐఏఎస్ అధికారులకు అలాగే పోస్టింగ్ ఇచ్చేశారు. విచిత్రం ఏమిటంటే దీనికి సంబంధించిన ఫైల్ ప్రొసీడింగ్స్ ఎక్కడా కనబడటం లేదట. అంతా నోటి మాట ద్వారానే జరిగిపోయింది. ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖల్లో రిటైర్ అయిన మురళీధర్ రావు, గణపతి రెడ్డి, రవీందర్ రావులు ఇఎన్సీలుగా ఇదే పద్ధతిలో కంటిన్యూ అవుతున్నట్లు బయటపడింది.

అసెంబ్లీ సెక్రటరీగా మూడేళ్ళ క్రితమే రిటైర్ అయిన నరసింహాచార్యులు కూడా ఇలాగే కంటిన్యూ అవుతున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎంసీహెచ్ఆర్డీ, సంక్షేమ, మున్సిపల్ శాఖల్లో కూడా చాలామంది ఉన్నతాధికారులు ఇదే పద్దతిలో రీ అపాయిట్మెంట్ తో కంటిన్యు అవుతున్నారట. వీళ్ళ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇలాంటి రీ అపాయిట్మెంట్ అరాచకాలు ఎన్ని శాఖల్లో జరిగాయో ఉన్నతాధికారులు లెక్కలు తీస్తున్నారు. కేసీయార్ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల వీళ్ళ తర్వాత అధికారులు ప్రమోషన్లు అందుకోకుండానే రిటైర్ అయిపోయారట.