మూడు రోజుల క్రితమే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి క్రాస్ చేయటం ఖాయమనుకున్న అంచనాలు తప్పు అయ్యాయి. శనివారం రాత్రి నాటి అతి తక్కువ కేసులు నమోదు కావటంతో వెయ్యి కేసులకు మరో పది కేసులు నమోదైతే తప్పించి ట్రిపుల్ ఫిగర్ ను దాటే అవకాశం ఉంది.
ఆ మధ్యన పెద్ద ఎత్తున కేసులు నమోదైన దానికి భిన్నంగా గడిచిన మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. శనివారం మరింత తక్కువగా.. సింగిల్ డిజిట్ కే పరిమితం కావటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా నమోదైన ఏడు కేసుల్లో ఆరు కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాగా.. వరంగల్ లో ఒక కేసు నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో శనివారం కేసులే నమోదు కాలేదు.
మొత్తంగా చూస్తే.. తెలంగాణలో శనివారం రాత్రి నాటికి 990 కేసులు వెలుగు చూడగా.. అందులో 307 మంది డిశ్చార్జి కాగా.. మరో పాతిక మంది ఇప్పటివరకూ మరణించారు. అంటే ఇప్పటికిప్పుడు ఉన్న యాక్టివ్ కేసులు 658 మాత్రమేనని చెప్పాలి. కొత్త కేసులు నమోదు కాని పక్షంలో రానున్న రెండు వారాల్లో పెద్ద ఎత్తున డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.
అదే జరిగితే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమపద్దతిలో తగ్గే వీలుంది. విదేశాల నుంచి వచ్చిన వారితో మొదలైన కరోనా కేసులు.. మర్కజ్ పుణ్యమా మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతం చుట్టుపక్కల రాకపోకల్ని బంద్ చేయటంతో పాటు.. కంటైన్ మెంట్ కేంద్రాలుగా గుర్తించి.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవటం షురూ చేసింది.
అదే సమయంలో.. పాజిటివ్ కేసుల కాంటాక్టును గుర్తించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి.. జల్లెడ పట్టింది. ఈ చర్యలు ఇప్పుడిప్పుడు సత్ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇలాంటివేళ.. సూర్యాపేట.. జోగులాంబ-గద్వాల.. వికారాబాద్ జిల్లాల్లో నమోదైన కొత్త కేసులతో తెలంగాణలో పాజటివ్ కేసుల సంఖ్య పెరిగింది.
వాటి కట్టడికి తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలే.. శనివారం నాటికి అతి తక్కువ కేసులు నమోదు కావటానికి కారణంగా చెబుతున్నారు. కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి పెరిగిన తర్వాత.. ఒకరోజులో సింగిల్ డిజిట్ కే పాజిటివ్ కేసులు పరిమితం కావటం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. 113 కుటుంబాల్లో నమోదైన కేసులో తెలంగాణలో పాజిటివ్ కేసులు భారీగా నమోదు కావటానికి కారణంగా చెప్పాలి. హైదరాబాద్ లో 44 కుటుంబాల నుంచి 268 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సూర్యాపేట జిల్లాలో పాతిక కుటుంబాల నుంచి 83 మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.
గద్వాల జిల్లాలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా రాగా.. వికారాబాద్ జిల్లాలో 14 కుటుంబాల నుంచి 38 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం మాదిరే మరో వారం రోజులు తక్కువ మోతాదులో పాజిటివ్ లు నమోదైతే.. కరోనా ముప్పు నుంచి తెలంగాణ బయటపడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on April 26, 2020 12:44 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…