ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ కుమార్తె షర్మిల ప్రవేశిస్తారని.. ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికికాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా తోడవుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్ర రాజు, మరోసీనియర్ నేత తులసి రెడ్డి వంటి వారు షర్మిల రాక ఖాయమని చెప్పుకొచ్చారు. ఆమె రాగానే తాము ఆమె బాటలో నడుస్తామని.. ప్రకటించారు. దీనికి తోడు వైసీపీకి బలమైన విశ్వసనీయ నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృ ష్ణారెడ్డి సైతం ఇదే ప్రకటన చేశారు.
మొత్తంగా చూస్తే.. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం.. గ్యాసిప్ కాదని.. వాస్తవమేనన్నది వీరి వ్యాఖ్యలు జరుగుతున్న పరిణామాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఇదే జరిగితే.. షర్మిల టార్గెట్ వైసీపీనే. అందునా.. తనను మానసికంగా.. ఆస్తుల పరంగా ఇబ్బంది పెట్టారనిభావిస్తున్న సొంత అన్న, సీఎం జగనే ఆమె టార్గెట్ గా మారనుందనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న చర్చ. అంతేకాదు.. షర్మిల కనుక ఏపీలోకి అడుగు పెడితే.. కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకు కూడా కదలబారే ప్రమాదం.. కూడా ఉంది.
దీనిని గమనించిన తాడేపల్లి వర్గాలు.. రాజీ మంత్రం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టవద్దని.. వస్తే.. వైసీపీలోనే కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు.. కడప లేదా విశాఖ ఎంపీ సీటును ఇస్తామని.. ఆస్తులను కూడా పంచేందుకు రెడీ అని రాయబారం పంపినట్టు తాడేపల్లిలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. వైసీపీకి నష్టం జరుగుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు.
ఈ క్రమంలో మనస్పర్థలు పక్కనపెట్టి అన్న, చెల్లెలను కలిపేలా యత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. షర్మిల విషయంపై విజయమ్మతో ఇప్పటికే చర్చలు ప్రారంభించారని సమాచారం. మధ్యవర్తిగా జగన్ పెద్దనాన్న కుమారుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిసింది. అనిల్‌రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న విజయమ్మ ఆయన చెప్పింది వింటారని అంటున్నారు. రాజీ కుదిర్చేందుకు విజయమ్మముందు పలు ప్రతిపాదనలు పెట్టారని సమాచారం.
ఇవీ ఆఫర్లు..
+ షర్మిలకు సిమెంట్ కర్మాగారంతో పాటు ఎంపీ టికెట్(విశాఖ-విజయవాడ-కడప ఏది కోరుకుంటే అది)
+ రాజీ కుదిరితే షర్మిలకు ఆస్తుల పంపకం.
+ పార్టీలోనూ కీలక బాధ్యతలు.
కండిషన్లు..
+ కాంగ్రెస్‌లో చేరొద్దు.
This post was last modified on January 1, 2024 11:08 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…