తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే అన్ని హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరింటిలో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. దీంతో, ఆ విషయాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అంటూ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కాకముందే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలని, పదేళ్లలో బీఆర్ఎస్ అమలు చేయని హామీలు ఎన్నో ఉన్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇస్తామని.. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది…కానీ డబ్బులు లేవు అని అసెంబ్లీలో సిద్ధరామయ్య చెబుతున్నట్లుగా ఉన్న వీడియోను కేటీఆర్ ట్వీట్ చేసి విమర్శలు గుప్పించారు.
దీంతో, కేటీఆర్ కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. అది ఫేక్ వీడియో అని 2 రోజుల క్రితమే తాను వివరణ కూడా ఇచ్చానని, ఫేక్ వీడియోకు ఒరిజినల్ వీడియోకు కూడా కేటీఆర్ కు తేడా తెలియదని సిద్ధరామయ్య చురకలంటించారు. అది తెలియదు కాబట్టే ఎన్నికల్లో ఓడిపోయారని కేటీఆర్ పై సెటైర్లు వేశారు. బిజెపి సృష్టించే నకిలీ ఎడిటెడ్ వీడియోలను బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తోందని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలే మీ బతుకు తెరువు అని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on December 19, 2023 9:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…