ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు షాక్ తప్పదా? వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
వరుసగా రెండు సార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజాకు గడ్డు కాలం పొంచి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో ప్రజలు, సొంత పార్టీ నాయకుల నుంచి రోజాపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటమే అందుకు కారణమని చెబుతున్నారు.
వచ్చే ఏడాది ఎన్నికలు జగన్ అత్యంత కీలకమైనవి. వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న జగన్ విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల మేరకు నియోజకవర్గాల ఇంఛార్జీలను మారుస్తున్నారు. గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో పరిస్థితి నేపథ్యంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్. నగరిలో రోజా పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని అంటున్నారు.
మరోవైపు రోజాకు వ్యతిరేకంగా అక్కడ వైసీపీలో మరో గ్రూప్ బలంగా మారుతోంది. ఈ వ్యతిరేక గ్రూప్ జగన్ తో టచ్లో ఉంటున్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతుందని జగన్ కు వీళ్లు చెప్పారని తెలిసింది. అంతే కాకుండా సర్వేల్లో కూడా రోజాకు మైనస్ మార్కులే వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో రోజాకు టికెట్ ఇవ్వొద్దని జగన్ అనుకుంటున్నారని తెలిసింది. ఎమ్మెల్సీ హామీనిచ్చి ఆమెను ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవాలని జగన్ అనుకుంటున్నారని టాక్. మరి రోజా దీనిపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి.