తెలంగాణ : లోక్ సభ ఎంపీ సీట్లు మెజారిటీ ఎవరికంటే…

ఇపుడు అందరి కళ్ళు రాబోయే పార్లమెంటు ఎన్నికలపైనే పడింది. మరో నాలుగు మాసాల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఫలితాలే పునరావృతమవుతుందా లేకపోతే మారిపోతాయా అన్న చర్చలే జరుగుతున్నాయి. ఈ సమయంలోనే టౌమ్స్ నౌ ఈటీజీ ఒక సర్వే జోస్యాన్ని విడుదలచేసింది. దాని ప్రకారం ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే అన్న ప్రాతిపదికన సర్వే నిర్వహించినట్లు చెప్పింది. లేటెస్ట్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కంఫర్టబుల్ రిజల్టుతో ఉన్నట్లు తేలింది.

విషయం ఏమిటంటే కాంగ్రెస్ కు 8-10 సీట్ల మధ్య గెలుపు ఖాయమని తేల్చింది. ఇక బీఆర్ఎస్, బీజేపీలకు చెరి మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు తేల్చింది. ఎంఐఎంకు ఒక సీటు గ్యారెంటీ అని చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ సరళి, ఆయా పార్టీలకు వచ్చిన ఓటింగ్ శాతాలు, ప్రజల్లో అభిప్రాయాలు తదితరాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహించినట్లుగా టైమ్స్ నౌ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది.

బీఆర్ఎస్ 9 నియోజకవర్గాలను, బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. హైదరాబాద్ లోక్ సభలో ఎంఐఎం గెలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు పోటీచేసి గెలవటంతో ఎంపీలుగా రాజీనామాలు చేశారు. కాబట్టి ఇపుడు కాంగ్రెస్ సంఖ్య జీరో అనే చెప్పాలి. అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 8 నుండి పది సీట్లలో గెలుస్తుందని తేలటం అంటే మంచి ఫిగర్ అనే చెప్పాలి. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగు మాసాలుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఆ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో ఇప్పటికే రెండింటిని అమల్లోకి తెచ్చారు రేవంత్. మిగిలిన ఆరింటిని కూడా అమల్లోకి తెచ్చేస్తే జనాల్లో సానుకూలత రావటం ఖాయమనే అనిపిస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ గెలుచుకోబోయే నియోజకవర్గాలు సర్వేలో తేలిందానికన్నా ఇంకా ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.