రేవంత్ దెబ్బ.. మెట్రో రైళ్లు బోసి పోయాయి

తెలంగాణ‌లో కొలువు దీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చీ రావ‌డంతోనే మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెచ్చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు వ‌య‌సుతో నిమిత్తం లేకుండా.. అంద‌రికీ ఉచిత ప్ర‌యాణం చేరువైంది. ఇది ఒక‌ర‌కంగా.. అస‌లే క‌ష్టాల్లో ఉన్న ఆర్టీసికి పెను భార‌మే అయినా.. ఎన్నిక‌ల హామీల అమలులో కాంగ్రెస్‌కు మాత్రం మైలేజీని పెంచేసింది.

ఇక‌, కాంగ్రెస్ తీసుకువ‌చ్చిన ఉచిత బ‌స్సు ప్ర‌యాణంతో మ‌హిళ‌లకు ఫ్రీ ర‌వాణా స‌దుపాయం అందుబాటు లోకి వ‌చ్చింది. దీంతో సొంత వాహ‌నాల‌ను(స్కూటీ త‌దిత‌ర‌) ప‌క్క‌న పెట్టేసి మరీ ఉద్యోగినులు కూడా.. బ‌స్సుల‌ను ఆశ్ర‌యించారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగినులు కూడా ఉచిత ర‌వాణాను వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7200 బ‌స్సులు అందుబాటులోకి వ‌చ్చాయి.

ఇదిలావుంటే.. ఫ్రీబ‌స్సు ప్ర‌యాణం కార‌ణంగా.. కీల‌క‌మైన మెట్రో రైళ్లు బోసి పోయాయి. ప్ర‌ధాని మోడీ ఇటీవ‌ల ప్ర‌చారంలో కూడా.. మెట్రో తీసుకువ‌చ్చి.. మేలు చేశామ‌ని చెప్పుకొచ్చారు. కానీ, కాంగ్రెస్ తీసుకువ‌చ్చిన ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణంతో మెట్రో రైళ్ల‌న్నీ ఖాళీగానే ప్ర‌యాణించాయి. కీల‌క‌మైన ఎల్బీ న‌గ‌ర్ రూట్‌లో నిత్యం కిట‌కిట‌లాడే.. మెట్రో స‌ర్వీసులు ప్ర‌యాణికులు లేక ముఖ్యంగా మ‌హిళ‌లు, యువ‌తులు లేక బోసిపోయాయి. మొత్తానికి కాంగ్రెస్ ఎఫెక్ట్‌తో మెట్రో రైళ్ల ఉనికికే దెబ్బ ప‌డిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌నే చ‌ర్చ సాగుతోంది.