సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయనకు వీర విధేయులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు అడుగడుగునా మడుగులు ఒత్తారు. ఆయన కనుసన్నల్లో పడేందుకు.. ఆయన ప్రాపు కోసం పరితపించారు. ఆయనను చూసుకుని.. తమకు తిరుగులేదని భావించారు. అయితే.. ఇప్పుడు వీరి పరిస్తితి అడకత్తెరలో పడిపోయింది. వారేమీ రాజకీయ నాయకులు కారు.. రాజకీయ వాసనలు కూడా లేవు.
వారే.. ఉన్నతస్థాయి ఐఏఎస్ అధికారులు. వీరిలో ఒకరు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ఈయన కేసీఆర్ కోసం.. ఇంకా తన ఉన్నతోద్యోగ కాలం మిగిలి ఉండగానే.. ఆ ఉద్యోగానికి రాజీనామా సమ ర్పించారు. ఏపీకి బదిలీ అయినప్పటికీ.. సీఎం కేసీఆర్ సిఫారసుతో రాత్రికి రాత్రి రాజీనామా చేయడం… దానిని ఏపీ ప్రభుత్వం ఆమోదించడం.. తెలిసిందే. ఆ వెంటనే సోమేష్‌కు.. కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా పోస్టు ఇచ్చేశారు.
కట్ చేస్తే.. తెలంగాణ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి.. శ్రీనివాసరావు ఉద్యోగానికి రాజీనామా చేయలేదు కానీ.. గత ఎన్నికల్లో ఉద్యోగులకు కేసీఆర్ అనుకూల ప్రసంగాలతో తన దైన ప్రచారం చేశారు. ఇక, కేసీఆర్ పాదాలకు నమస్కారం చేయడం.. ఆయన చెప్పింది వేదమని నమ్మడం.. ఆయన కనుసన్నల్లో పడేందుకు ప్రయత్నం చేయడం వంటివి అనేక రూపాల్లో విమర్శలకు దారి తీసింది.
అయితే.. ఇప్పుడు ఈ ఇద్దరి పరిస్థితి తీవ్ర ఇరకాటంలో పడిపోయింది. అటు ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సోమేష్‌ను రేవంత్ రెడ్డి పక్కన పెట్టేశారు. ఇక, శ్రీనివాసరావును ప్రాధాన్యం లేని అటవీ శాఖకు బదిలీ చేయనున్నట్టు సమాచారం. కట్ చేస్తే.. ఇలా.. స్వామి భక్తి పరాయణులు ఏపీలోనూ ఎక్కువగా ఉన్నారు. ఇటు పోలీసు నుంచి అటురెవెన్యూ , ఎక్సైజ్ వరకు చాలా మంది ఉన్నారు. రేపు సర్కారు మారితే వీరి పరిస్థితి కూడా.. ఇంతేనా? అనేది కీలక చర్చ. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates