కేసీఆర్ మా వాళ్ల‌తో మాట్లాడుతున్నారు: డీకే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రో 24 గంట‌ల గ‌డువే ఉండ‌డంతో కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ క‌ర్నాట‌క పీసీసీ చీఫ్‌, ఉప‌ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన‌కు అందిన స‌మాచారం మేర‌కు… దాదాపు 40 మంది నేత‌ల‌తో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు డీకే వెల్ల‌డించారు.

కేసీఆర్ ఓడిపోతున్నారు. బీఆర్ ఎస్ నేల మ‌ట్టం అయ్యేందుకు రెడీ అయింది. కానీ, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్ర‌లోబాలు పెట్టేందుకు ప‌న్నాగారు రెడీ చేసుకున్నారు. మా నాయ‌కుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శ‌నివారం ఉదయం వ‌ర‌కు దాదాపు 40 మంది నాయ‌కుల‌కు ఆయ‌న ఫోన్‌లు చేసిన మాట్లాడారు. ఈ స‌మాచారం మా ద‌గ్గ‌ర ఉంది. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని డీకే వెల్ల‌డించారు.

అంతేకాదు.. ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు ఎక్క‌డా అబ‌ద్ధం కాలేద‌ని చెప్పిన డీకే.. క‌ర్ణాట‌లో ఎగ్జిట్ పోల్స్ నిజ‌మైన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేకే.. కేసీఆర్ మ‌భ్య‌పెట్టి, ప్ర‌లోభ‌ప‌రిచే రాజ‌కీయాల‌కు తెరదీశార‌ని చెప్పుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ నేత‌లు ధైర్యంతో ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. ఏ ఒక్క‌రూ పార్టీ ఆదేశాల‌కు దూరంగా ఉండ‌ర‌ని, ప‌దేళ్ల త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌ని చెప్పుకొచ్చారు.