ఏ పార్టీలో అయినా అగ్రనాయకులుగా ఉన్నవారు.. వారి వారి సొంత జిల్లాలపై పట్టుంటుంది. అంతేకాదు.. తాము అంచనా వేస్తే.. ఇక, జరిగి తీరుతుందనే నమ్మకం కూడా వారికి ఉంటుంది. ఇలా.. తెలంగాణ పీసీ సీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా తన సొంత జిల్లాపై అనేక అంచనాలు వేసుకున్నారు. తాను చెప్పిందే జరు గుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సొంత జిల్లా పాలమూరురంగారెడ్డి జిల్లా. ఇక్కడ 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
అయితే.. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తం కాంగ్రెస్‌పార్టీ స్వీప్ చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంత కాన్ఫిడెంట్‌గా రేవంత్ రెడ్డి చెప్పడానికి రెండు రీజన్లు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒకటి అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు.. ఈ జిల్లా నుంచి తొలిసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టే నాయకుడుగా రేవంత్ ఎదగడం. దీంతో ఆయనను మరింత సపోర్టు చేయాలంటే.. పార్టీలో ఆయన మాట నెగ్గాలంటే.. జిల్లాలోని అన్ని సీట్లను కానుక ఇస్తారనే ధీమా రేవంత్‌కు ఉంది.
ఇక, రెండోది.. పాలమూరు రంగారెడ్డిజిల్లాలో గతానికి భిన్నంగా పార్టీనేతలను ఆచితూచి టికెట్‌లు ఎంచుకున్నారు. దీంతో వారంతా గెలిచి తీరుతానే భావన కూడా ఆయనకు వుంది. ఇక, మరీ ముఖ్యంగా అధికార పార్టీ నేతల ఆగడాలు..ఇక్కడ బీఆర్ ఎస్‌కు చెక్ పెడతాయని కూడా అంచనా వేస్తున్నారు. వెరసి.. పాలమూరు రంగారెడ్డిలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంటుందని రేవంత్‌చెబుతున్నారు.
ఇదిలావుంటే, జిల్లా లవారీగా.. వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ విజయం ఖాయమని తేలిపోయింది. ఇక, మిగిలిన 13 నియోజకవర్గాలో 8 చోట్ల కాంగ్రెస్ నాయకులు గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో రేవంత్‌చెప్పినట్టు క్లీన్ స్వీప్ చేయకపోయినా.. మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం తథ్యమనే భావన అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.