19 స్థానాలు.. 2290 మంది అభ్య‌ర్థులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ‌.. స్వ‌తంత్రులు, రెబ‌ల్స్ బెడ‌ద జోరుగా ఉంది. 2018 ఎన్నిక‌ల్లో 119 స్థానాల‌కు 1057 మంది పోటీ చేయ‌గా.. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపైంది. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు విడుద‌ల చేసిన జాబితా ప్ర‌కారం.. నామినేష‌న్ల ప‌ర్వం ముగిసేనాటికి(ఈ నెల 15, బుధ‌వారం) మొత్తం 2290 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. చాలా చోట్ల ప‌దుల సంఖ్య‌లో నామినేష‌న్ల‌ను వెన‌క్కి తీసుకున్నా..గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే పోటీ చేసేవారు ఎక్కువ‌గా ఉన్నార‌ని సంఘం తెలిపింది.

ఎక్క‌డెక్క‌డ ఎంత మంది అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొత్తంగా బుధ‌వారం 608 మంది అభ్య‌ర్థులు ఒకే రోజు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకున్నార‌ని అధికారులు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌దుల సంఖ్య‌లో అభ్య‌ర్థులు పోటీలో ఉన్నార‌ని తెలిపారు.

  • గజ్వేల్‌ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
  • కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు త‌ల‌ప‌డుతున్నారు.
  • ఎల్‌బీ నగర్‌లో 48 మంది పోటీలో ఉన్నారు.
  • పాలేరులో 37 మంది, కోదాడలో 34 మంది, నాంపల్లిలో 34 మంది, ఖమ్మంలో 32మంది పోటీ చేస్తున్నారు
  • మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం నల్గొండలో 31 మంది పోటీ చేస్తున్నారు.
  • కొత్తగూడెంలో 30 మంది ఎన్నికల బరిలో నిలిచారు.
  • ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాలు అన్నింటిలోనూ 15-20 మంది చొప్పున పోటీ చేస్తున్న‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి.

మెజారిటీపై దెబ్బ‌!

ఈ ప‌రిణామం కీల‌క పార్టీలైన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. పోటీలో రెబ‌ల్స్‌, రైతులు, స్వతంత్ర అభ్య‌ర్థులు, తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న యువ‌త కూడా ఉన్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్ల చీలిక ఖాయ‌మ‌ని ఒక అంచ‌నాకు వ‌చ్చారు. దీంతో మెజారిటీ త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని అభ్య‌ర్థులు క‌ల‌వ‌ర‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.