నిండు అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి ‘కామ’ వ్యాఖ్య‌లు

బిహార్ సీఎం నితీశ్ కుమార్‌. ఈ పేరు విన‌గానే సౌమ్యుడు, విన‌య‌శీలి, రాజ‌కీయంగా ప‌రిణితి ఉన్న వివాద ర‌హిత నాయ‌కుడి గా చెబుతారు. అంతేకాదు..కేంద్రంలోని న‌రేంద్ర మోడీని సైతం ఎదిరించి.. పాల‌న సాగిస్తున్న నేత‌గా కూడా గుర్తింపు తెచ్చుకు న్నారు. అలాంటి నితీశ్ కుమార్ నోట‌.. అన‌కూడ‌ని మాట‌.. బ‌హిరంగ ప్రాంతాల్లో విన‌కూడ‌ని మాట వ‌చ్చింది. అది కూడా ఏ న‌లుగురు మ‌ధ్యో కాదు.. త‌న పార్టీ నేత‌ల మ‌ధ్య అంత‌క‌న్నా కాదు. ప్ర‌జ‌లతో ఎన్నుకోబ‌డిన శాస‌న స‌భ్యులు కొలువు దీరిన బిహార్ నిండు అసెంబ్లీలోనే!! శృంగారం చివ‌ర్లో మ‌హిళ‌లు.. `దానిని బ‌య‌ట‌కు తీసేస్తే..` రాష్ట్రంలో జ‌నాభా నియంత్ర‌ణ జ‌రుగుతుంది అని నితీశ్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. బిహార్ ముఖ్య‌మంత్రి సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకుని రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న చేప‌ట్టారు. ఇది దేశంలోనే తొలిసా రి. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. కేసులు సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లినా.. ఆయ‌న వెనుదిర‌గ‌కుండా ముందుకే సాగారు.ఇక‌, ఈ కుల గ‌ణ‌న‌కు సంబంధించిన‌తుది రిపోర్టు రావ‌డం.. దానిని స్వ‌యంగా నితీశ్ కుమార్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. ఈ సంద‌ర్భంగా నితీశ్ ఈ నివేదిక‌లోని గ‌ణాంకాల‌ను అసెంబ్లీలో చ‌దివి వినించారు. రాష్ట్రంలో జ‌నాభా పెరుగుతోంద‌ని.. దీనిని నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో పురుషుల క‌న్నా మ‌హిళ‌ల‌కే అవ‌గాహ‌న ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. అందునా చ‌దువుకున్న మ‌హిళ‌లైతే మ‌రింత అవ‌గాహ‌న ఉంటుంద‌ని అన్నారు. ఇది కూడా త‌ప్పుకాదు. కానీ.. ఇక్క‌డే నితీశ్ పెద్ద త‌ప్పుడు మాట అనేశారు. జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో పురుషుల క‌న్నా మ‌హిళ‌ల‌కే ఎక్కువ అవ‌గాహ‌న ఉంటుంది. అది కూడా చ‌దువుకున్న మ‌హిళ‌లైతే మ‌రింత ఉంటుంది. గ‌ర్భం రాకుండా శృంగారం చేయ‌డం ఎలా అనేది ఆమెకు బాగా తెలుస్తుంది. శృంగారం అంతా స‌రిగానే జ‌రిగినా.. చివ‌రి కొద్ది పాటి నిమిషంలో `బ‌య‌ట‌కు తీసేయాలి`. ఈ విష‌యం చ‌దువుకున్న మ‌హిళ‌ల‌కు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో జ‌నాభా నియంత్ర‌ణ దానంత‌ట అదే జ‌రిగిపోతుంది అని తీవ్ర వివాదాస్ప‌ద వాఖ్య‌లు చేశారు.

ఇక‌,నితీశ్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ మంట‌లు పుట్టించాయి. నితీశ్ ను ఓ అస‌భ్య‌క‌ర‌మైన నాయ‌కుడిగా బీజేపీ నేత‌లు అభివ‌ర్ణించా రు. సోష‌ల్ మీడియాలోనూ నిన్న మొన్నటి వ‌రకు నితీశ్ అంటే సానుభూతి క‌న‌బ‌రిచిన వారు కూడా ఇలాంటి మాట‌లు అనేందుకు నోరెలా వ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. నితీశ్ వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా దావాల‌నంలా వ్యాపించాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ నేత‌లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళా క‌మిష‌న్ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే, అసెంబ్లీ ప‌రిధిలో జ‌రిగిన విష‌యం కావ‌డంతో దీనిపై స్పీక‌ర్ వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని అధికార వ‌ర్గాలుతెలిపాయి.