తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కాదు నరేంద్రమోడీకే అసలు పరీక్షగా మారబోతోంది. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వస్ధాయిలో కానీ ఎవరినీ ఎదగనీయకుండా చేయటమే పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వంతో పాటు పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. తన నాయకత్వానికి ధీటుగా ఇంకెవరు ఎదగకుండా అందరినీ తొక్కిపడేశారు. దానివల్ల ఇపుడేమైందంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా అందరు మోడీవైపు మాత్రమే చూస్తున్నారు.
సొంత బలం ఉన్న నేతల్లో చాలామందిని ఎందుకు పనికిరాని వారి కింద మోడీ మార్చేశారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో సమర్ధులున్నా వాళ్ళెవరు ఏ విషయంలోను జోక్యం చేసుకోవటంలేదు. ప్రతి విషయాన్ని మోడీ నిర్ణయానికే వదిలేస్తు కొందరు సీనియర్ మంత్రులు కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేయటానికి మాత్రమే పరిమితమైపోయారు. మిగిలిన మంత్రుల్లో ఎలాగూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని యాక్ట్ చేసే అవకాశాలు లేవు.
హోలు మొత్తం మీద ఇపుడు పరిస్ధితి ఏమిటంటే ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలు తెలంగాణా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరంలో బీజేపీ గెలుపు అంత వీజీకాదని తేలిపోయింది. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో 50:50 ఛాన్సంటున్నారు. తెలంగాణాలో అసలు పోటీలోనే లేదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. మిజోరం సంగతి అందుబాటులో లేదు. సో ఏరకంగా చూసుకున్నా ఏ రాష్ట్రంలోను బీజేపీకి గెలుపు అవకాశాలు పెద్దగా కనబడటం లేదని అర్ధమవుతోంది.
పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు మోడీ సమర్ధతకు పెద్ద పరీక్షగా మారింది. మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో బీజేపీలో నిరుత్సాహం పెరిగిపోతుంది. ప్రతి రాష్ట్రంలోను మోడీయే తిరిగి అభ్యర్ధులను, పార్టీని గెలిపించాలంటే జరిగే పనికాదు. మొన్ననే జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత కూడా మోడీ కళ్ళు తెరవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే బీజేపీకన్నా మోడీకే అసలైన పరీక్ష ఎదురవ్వబోతోందనేది.
This post was last modified on November 3, 2023 10:31 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…